Bimbisara: కళ్యాణ్ రామ్ బింబిసార మూవీ క్రేజీ అప్డేట్.. టైం ట్రావెల్ నేపథ్యంలో సినిమా..?

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ త్వరలో హిస్టారికల్ సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. బింబిసార అనే సినిమా చేస్తున్నాడు కళ్యాణ్ రామ్.

Bimbisara: కళ్యాణ్ రామ్ బింబిసార మూవీ క్రేజీ అప్డేట్.. టైం ట్రావెల్ నేపథ్యంలో సినిమా..?
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 30, 2021 | 12:50 PM

 నందమూరి హీరో కళ్యాణ్ రామ్ త్వరలో హిస్టారికల్ సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. బింబిసార అనే సినిమా చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ  హీరో. కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా ప్రయోగాత్మక సినిమాలు కూడా చేస్తుంటాడు కళ్యాణ్ రామ్. పటాస్ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ ఆ రేంజ్ హిట్ ను అందుకోలేక పోయాడు. ఇక ఇప్పుడు హిస్టారికల్ సినిమాతో అలరించడానికి సిద్దమవుతున్నాడు. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందిన మగధ రాజ్యాధిపతే బింబిసారుడు. ఆయన కథతోనే ఈ సినిమా తెరకెక్కుతుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ నిర్మిస్తున్నాడు. పుణ్యభూమిలో ఓ అటవిక రాజు కథే ఈ సినిమా అంటూ చిత్రబృందం మోషన్ పోస్టర్ లింకును పంచుకుంది. ఇందులో కల్యాణ్ రామ్ సరసన కాథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ నటిస్తున్నారు. ఎన్టీఆర్ జయంతి సంధర్భంగా ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు. ఈ సినిమాలో  కళ్యాణ్ మూడు పాత్రలలో కనిపిస్తాడని టాక్. కళ్యాణ్ రామ్ ఇదివరకు డ్యూయెల్ రోల్ చేసాడు కానీ త్రిపాత్రభినయం ఇదే ఫస్ట్ టైమ్ అవుతుంది.

బింబిసార సినిమా మూడు పార్ట్స్ అని.. కొన్ని రెండు పార్ట్స్ గా రాబోతుందని వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ తాజాగా ఈ చిత్రం కేవలం ఒకే పార్ట్ ఉంటుందని సీక్వెల్స్ ఉండవని వినికిడి. అలాగే సినిమా పూర్తిగా పీరియడిక్ నేపథ్యంలో ఉండదని సమాచారం. ఈ సోషియో ఫాంటసీ చిత్రం టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కుతోందని అంటున్నారు. చూడాలి మరి ఏంజరుగుతుందో.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Tirumala – Boyapati: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బోయపాటి.. స్వామివారి సన్నిధిలో అఖండ రిలీజ్ పై క్లారిటీ

Kamal Haasan: నలుగురు విలన్లతో తలపడనున్న విశ్వనటుడు.. మక్కల్ సెల్వన్ పేరు కూడా వినిపిస్తుందే..

Akshay-Rakul : బాలీవుడ్ లో వరస అవకాశాలను అందుకుంటున్న రకుల్.. అక్షయ్ తో రొమాన్స్ చేసే ఛాన్స్