Kamal Haasan: నలుగురు విలన్లతో తలపడనున్న విశ్వనటుడు.. మక్కల్ సెల్వన్ పేరు కూడా వినిపిస్తుందే..

లోకాలనాయకుడు కమల్  ప్రస్తుతం అటు రాజకీయాలతో ఇటు సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. కమల్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2..

Kamal Haasan: నలుగురు విలన్లతో తలపడనున్న విశ్వనటుడు.. మక్కల్ సెల్వన్ పేరు కూడా వినిపిస్తుందే..
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 30, 2021 | 12:20 PM

Kamal Haasan: లోకాలనాయకుడు కమల్  ప్రస్తుతం అటు రాజకీయాలతో ఇటు సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. కమల్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2. అలాగే లోకేష్ కనగ రాజ్ దర్శకత్వంలో విక్రమ్ అనే సినిమా చేస్తున్నాడు. ‘ఇండియన్ 2’ చిత్రం లేట్ అవుతుండటంతో దీనిని సెట్స్ పైకి తీసుకెళ్లారు కమల్ హాసన్.. లోకనాయకుడి కెరీర్లో వస్తున్న ఈ 232వ సినిమాని రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇప్పటికే కమల్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లిమ్స్ తో సినీ ఇండస్ట్రీలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్టుగానే భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు పేర్కొంటున్నాయి సినీవర్గాలు. ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండనున్నాయని తెలుస్తుంది. ఇప్పటికే ఈ చిత్రానికి ‘కేజీఎఫ్’ స్టంట్ మాస్టర్స్ అన్బు-అరివ్ యాక్షన్ కొరియోగ్రఫీ అందివ్వనున్నారు. ”విక్రమ్” సినిమాలో కమల్ ని ఢీకొట్టడానికి నలుగురు ప్రతినాయకులు ఉంటారని టాక్ నడుస్తోంది.

ఇప్పటికే మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ ను ఒక విలన్ రోల్ కోసం తీసుకున్నారు. ఇప్పుడు మేకర్స్ మిగతా ముగ్గురు విలన్స్ ను ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారట. ఈ నేపథ్యంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ని కూడా సంప్రదిస్తున్నారని అంటున్నారు. అయితే ఇటీవల మాస్టర్ సినిమాలో విజయ్ సేతుపతి విలన్  నటించి మెప్పించిన విషయం తెలిసిందే. మాస్టర్ సినిమాకు లోకేష్ కానగరాజ్ డైరెక్టర్ అన్నవిషయం తెలిసిందే. అంతే కాదు డైరెక్టర్ కమ్ కొరియోగ్రాఫర్ కమ్ హీరో రాఘవ లారెన్స్ పేరు కూడా వినిపిస్తుంది. చూడాలి మరి ఏంజరుగుతుందో. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత ఇటీవలే ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారభమైంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Balakrishna : బాలయ్య బాబు కోసం అదిరిపోయే కథను సిద్దమా చేస్తున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్..

Rashmika mandanna : విజయ్ దేవరకొండతో ఉన్న రిలేషన్ గురించి ప్రశ్నించిన నెటిజన్.. రష్మిక సమాధానం ఏంటో తెలుసా..

Avika Gor Birthday special: వానలో తడుస్తూ… చిందులేస్తున్న అందాల అవికా..