AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna : బాలయ్య బాబు కోసం అదిరిపోయే కథను సిద్దమా చేస్తున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్..

నట సింహం బాలయ్య బాబుతో సినిమా చేయాలనీ సక్సెస్ ఫుల్ డైరెక్టర్  అనిల్ రావిపూడి ఎప్పటినుంచో ట్రైచేస్తున్నాడు.

Balakrishna : బాలయ్య బాబు కోసం అదిరిపోయే కథను సిద్దమా చేస్తున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్..
Rajeev Rayala
|

Updated on: Jun 30, 2021 | 10:29 AM

Share

Balakrishna :

నట సింహం బాలయ్య బాబుతో సినిమా చేయాలనీ సక్సెస్ ఫుల్ డైరెక్టర్  అనిల్ రావిపూడి ఎప్పటినుంచో ట్రైచేస్తున్నాడు. ఇటీవలే అనిల్ తో సినిమా చేయడానికి బాలకృష్ణ సిద్దమగా ఉన్నారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బాలయ్య కోసం అదిరిపోయే కథ రెడీ చేసే పనిలో పడ్డాడట  అనిల్ రావిపూడి. ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనిల్. ఇప్పుడు బాలయ్య కోసం ఎలాంటి కథను సిద్ధం చేస్తున్నాడా అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.  అనిల్ మొదటి నుంచి తన సినిమాల్లో కామెడీని ప్రధాన అంశంగా తెరకెక్కిస్తూ వస్తున్నాడు. అయితే బాలయ్య బాబు సినిమా అంటే అభిమానులు భారీ యాక్షన్ ను, మాస్ డైలాగ్ లను ఆశిస్తారు. దాంతో  అనిల్ సినిమా ఎలా ఉండబోతుందన్న ఇంట్రస్ట్ సినీ లవర్స్ లో క్రేయేట్ అయ్యింది.  ప్రస్తుతం అనీల్ ‘ఎఫ్ 3’ సినిమా చేస్తున్నాడు. సూపర్ హిట్ ‘ఎఫ్ 2’ ఫ్రాంచైజీలో విక్టరీ వెంకటేష్ – మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ కి ఫైనాన్స్ ని జత చేసి ‘ఎఫ్ 3’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు – శిరీష్ నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటే బాలయ్య సినిమా కోసం రామారావు అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసుకున్నారు అనిల్. ‘ఎఫ్ 3’ షూటింగ్ చివరి దశకు రావడంతో బాలయ్యకు చెప్పిన కథను మరింత పదునుగా తయారు చేసే పనిలో ఉన్నాడట స్టార్ డైరెక్టర్ అనిల్. ఇదొక యునిక్ స్క్రిప్ట్ అని.. ఇంతకముందు చూడని విధంగా బాలకృష్ణ ను చూపిస్తానని అనిల్ రావిపూడి చెబుతూ వస్తున్నాడు. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో నటసింహాన్ని అనిల్ ఎలా చూపిస్తాడో చూడాలి. ప్రస్తుతం బాలయ్య ఎంబోయపాటితో సినిమా  చేస్తున్నాడు. ఆతర్వాత గోపీచంద్ మలినేని తో కమిట్ అయ్యాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత అనిల్ సినిమా పట్టాలెక్కనుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Karthika Deepam: మోనిత కార్తీక్ ల పెళ్లి విషయం దీపకు చెప్పిన భాగ్యం.. పెళ్లి ఎలా ఆపాలని ఆలోచిస్తున్న కార్తీక్

Allari Naresh birthday : తన కామెడీతో గిలిగింతలు పెట్టే అల్లరోడు… ఈ క్రేజీ హీరో

లీకైన హరిహర వీర మల్లు పవన్ కళ్యాణ్ ఫైట్ సీన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్:Hara Hara Veera Mallu video leaked