Karthika Deepam: మోనిత కార్తీక్ ల పెళ్లి విషయం దీపకు చెప్పిన భాగ్యం.. పెళ్లి ఎలా ఆపాలని ఆలోచిస్తున్న కార్తీక్

Karthika Deepam: కార్తీక దీపం సీరియల్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని టాప్ రేటింగ్ తో దూసుకుపోతూ.. నేడు 1079 వ ఎపిసోడ్ లోకి అడుగు పెట్టింది. మోనిత కార్తీక్ తో పెళ్ళికి రెడీ అవుతూ.. పెళ్ళికి సాక్ష్యంగా సౌందర్య, దీపలను తీసుకుని..

Karthika Deepam: మోనిత కార్తీక్ ల పెళ్లి విషయం దీపకు చెప్పిన భాగ్యం.. పెళ్లి ఎలా ఆపాలని ఆలోచిస్తున్న కార్తీక్
Karthika Deepam
Follow us
Surya Kala

|

Updated on: Jun 30, 2021 | 9:06 AM

Karthika Deepam: కార్తీక దీపం సీరియల్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని టాప్ రేటింగ్ తో దూసుకుపోతూ.. నేడు 1079 వ ఎపిసోడ్ లోకి అడుగు పెట్టింది. మోనిత కార్తీక్ తో పెళ్ళికి రెడీ అవుతూ.. పెళ్ళికి సాక్ష్యంగా సౌందర్య, దీపలను తీసుకుని రమ్మనమని చెబుతుంది. కార్తీక్ ఇంటికి వస్తుంటే.. సౌందర్య ఎదురవుతుంది, తల్లితో నిరాశగా మాట్లాడుతుంటే.. సౌందర్య తన కొడుకు కోడల కోసం ఏమి చేయాలనీ ఆలోచిస్తుంది. ఇంటికి వచ్చిన మోనిత కు ప్రియమణి ఎదురవుతుంది.. ఇంటికి ఎవరో వచ్చినట్లు చెబుతుంది. తనకు ఎవరో తెలియదని.. ఇప్పటి వరకూ ఎప్పుడూ చూడలేదని అంటుంది. ఎవరబ్బా నాకు చుట్టాలు లేరు అంటూ లోపలకి వస్తుంది.

మోనిత భాగ్య ఎదురయ్యాయి.. ఏమైనా తిన్నావా కడుపుతో ఉన్నవాళ్లు ఖాళీ కడుపుతో ఉండకూడదు అంటుంది.. నా ఇంట్లో నాకు మర్యాద ఏమిటి అన్న మోనిత తో .. ఇది మా కార్తీక్ బాబు కొనిచ్చాడా అంటే లేదు నేనే నా డబ్బులతో కొనుకున్నా అంటుంది మోనిత పోనీ కారైనా కొనిచ్చాడా అంటే… లేదు అది కూడా నా డబ్బుతోనే నేను కొనుకున్నా అంటుంది మోనిత .. అదేంటి.. కార్తీక్ దగ్గర మొత్తం లాగెసావని అందరూ అనుకుంటున్నారు.. అంటూ.. అదేంటమ్మా నీవెంటో నాకు తెలుసు.. నేను ఏమిటో నీకు తెలుసు. నువ్వు ఉత్తమనిషివి కాదని.. రవ్వలడ్డులు, మైసూర్ పాక్ , చేసుకొచ్చా నీ కోసం అంటే మోనిత, ప్రియమణి లు షాక్ తో చూస్తారు. ఇవి లోపల పెట్టు అంటుంటే.. ప్రియమణి ఎవరమ్మా మీ పిన్నిగారా అంటే.. కాదు దీప వాళ్ళ పిన్నిగారు అంటే.. ప్రియమణి షాక్ తో నోరు వెళ్లబెడుతుంది.

ఈవిడ ఏమిటి.. సవతి కూతురు దీపకు తగిన శాస్తి జరిగిందని నా దగ్గరకు వచ్చిందా.. ఒకసారి దీప విజయనగరం లో అన్నవిషయం గురించి అరా తీయడానికి వెళ్తే.. వెటకారంగా మాట్లాడి పంపించింది అని తనలో తాను అనుకుంటుంది. చూడమ్మా మోనిత ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి ప్రయత్నిస్తే.. మా వదిన సౌందర్య గురించి నీకు నాకు తెలిసిందేగా.. ఇల్లు కారు నువ్వే కొనుకున్నావు.. అలాగే ఆ బిడ్డని కూడా నువ్వే పెంచుకో .. కావాలంటే ఆ బిడ్డని మా అల్లుడు చదివిస్తాడు అని అంటుంది భాగ్య

ఆ విషయంలో మా అల్లుడు మంచోడే.. అప్పట్లోనే శౌర్యనే చదివించాడు.. అయినా వాళ్లమానాన్న వాళ్ళని వదిలెయ్యి.. నువ్వు ఇక్కడే ఉండు.. అప్పుడప్పుడు వచ్చిపోతూనే ఉంటాడు మా అల్లుడు అంటే.. మోనిత నవ్వుతూ నాకు కార్తీక్ కి పెళ్లి అని భాగ్యానికి చెబుతుంది. ఈ నెల 25న రిజిస్టర్ ఆఫీస్ లో జరుగుతుంది. అందు రసీదు చూపిస్తూ.. నీరుతాగేసి వెళ్ళండి అని చెబుతుంది. భాగ్య 25న పెళ్లా అంటూ దీప అక్కడ నుంచి బయలు దేరుతుంది.

కార్తీక్ దగ్గరకి దీప వచ్చి.. భోజనానికి పిలిస్తే.. నాకు ఆకలిలేదు.. ఏది ఆగదు.. పిల్లలు ఆకలికి ఆగలేరు.. పిల్లల్తో మీరు సరిగా మాట్లాడంలేదు.. వాళళ్తో మాట్లాడంలేదు.. సంతోషంగా మాట్లాడం లేదు అంటే.. సంతోషం అనేది ఇంజెక్షన్ చేస్తేనో మందులు వేస్తేనో రాదు.. అంటే.. నిజమే సంతోషం అనేది.. ఇంకొకరి చేతుల్లో చేతల్లో ఉంది అంటుంది దీప. నేను వెళ్తాను.. పిలలల్తో నువ్వుకూడా ఇదివరకూ ఉండడం లేదు.. అంటే.. నేను మా మమ్మీ దగ్గరకు వెళ్ళొస్తాను.. అంటే.. ఎక్కడికి వెళ్ళొస్తారు అని నేను అడగలేదు అంటుంది దీప.. నీ మాటల్లో వెటకారం నేను అర్ధం చేసుకోలేను అనుకున్నావా.. అంటే.. మన గురించి సందెవేళ ఎందుకు లెండి.. అంటే.. నువ్వు ఏదైనా అనాలనుకుంటే నన్ను డైరెక్ట్ గా అనొచ్చు దీపా అంటాడు కార్తీక్ . నీకా రైట్స్ ఉన్నాయి.. హక్కులే కదా.. నేను డాక్టర్ చదవలేదు.. అందుకు హక్కులకు పూర్తి విలువ తెలియదు.. ఏ హక్కు తో ఆపగలను.. భార్య హక్కా.. పౌరసత్వపు హక్కా… అంటే.. ఆపు దీప.. నాకు నటించడం రాదు.. అంటే.. నాకు నటన ఎదో.. నిజమేదో గుర్తించడం రాదు అంటుంది దీప. మీ మనసు ఏది చెబితే అదే చేస్తారా.. అయితే మోనిత విషయంలో తొందరపడమని మీ మనసు చెప్పిందా అంటే.. వెటకారంగా అంటుంది.  నేను మా అమ్మదగ్గరకి వెళ్తున్నా అంటూ కార్తీక్ .. వెళ్తుంటే.. ఇంత మదన పడుతున్నారు.. మరి ఆ తప్పు ఎలా జరిగింది అనుకుంటుంది దీప

మోనితకు పాలు తీసుకొచ్చి ఇచ్చిన ప్రియమణి .. మీ కోరిక ఇన్నాళ్లకు తీరబోతుంది.. అందరినీ పిలిచి పెళ్లి చేసుకోకుండా ఇలా సంతకాల పెళ్లి ఏమిటి అని అడుగుతుంది. పిచ్చిదానా అంటూ ఎలా చేసుకున్నా మేడలో కట్టించుకునేది తాళే కదా.. అయినా ఈ మోనిత ఏమి చేసినా అర్ధం పరమార్ధం ఉంటుంది అంటే.. సర్లెమ్మా ఇంతకీ కార్తీకయ్య ఏమన్నారు అని అడుగుతుంది ప్రియమణి.. పెళ్ళికి ఒప్పుకున్నారా.. లేక ఒప్పించారా .. ఊరికే అడిగా.. పెళ్ళాం పిల్లలు ఉన్నవాడు. ఎలా ఒప్పుకుంటాడు.. ఒప్పించా అంటే.. అయితే ఈ పెళ్లి మూడు రోజుల ముచ్చటే అంటుంది ప్రియమణి.

సౌందర్య దగ్గరకు వచ్చిన కార్తీక్ తో సుపుత్రుడు, దేశోద్ధారకుడు ఎక్కడరా ఆ పేర్లు.. ఏ కొంపలో తాకట్టు పెట్టావు.. ఇంటికి తలవంపులు తెచ్చావు.. నువ్వు డాక్టర్ వి ఎందరికో సాయం చేస్తావు అలాగే మోనిత కు సాయం చేసావా.. పుత్ర బిక్ష పెట్టమని వేడుకుందా నా కోడలి సౌ భాగ్యంలో సగం రాసివ్వమని అడిగిందా.. లేదంటే నా కోడలి తరిమేసి ఆ స్థానం ఇవ్వమని కోరిందా అంటూ కార్తీక్ ని ప్రశ్నిస్తుంది. ఎం చేస్తానని వాగ్దానం చేసావు.. అంటే నేను మాట ఇవ్వలేదు అన్న కార్తీక్ తో జీవితాన్నే ఇస్తున్నావు కదా మీ అజరామమైన ప్రేమ పెళ్లి వరకూ వెళ్ళిందికదా అన్న సౌందర్య తో నీకు ఎలా తెలుసు అంటే.. దీపకు తెలుసా అని అడుగుతుంది, లేదు అంటున్న కార్తీక్ తో నేను చెప్పలేకపోయాను అంటుంది సౌందర్య.. నీకు ఎలా తెలుసు అంటే.. చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి కన్యాకుమారి వచ్చి చెప్పి పోయింది అంటుంది సౌందర్య. డేట్ కూడా చెప్పింది. అంటుంది అత్తగారి ఆశీస్సుల కోసం వచ్చి మరీ తీసుకుని వెళ్ళింది.

నన్ను రిజిస్టర్ ఆఫీసర్ కు తీసుకుని వెళ్ళింది అని చెబుతాడు.. నిన్ను తీసుకుని వెళ్లిందా బలి పశువులా తీసుకుని వెళ్లిందా నువ్వు మనస్ఫూర్తిగా వెళ్ళావా అంటుంది సౌందర్య. మమ్మి నాకు తెలిసి నేను మంచివాడిని.. నాకు తెలియకుండా చెడ్డవాడిగా అయ్యా.. ఎలా ఉండాలి అంటే.. జవాబుదారిలా ఉండాలి.. పదేళ్లు అగ్నిప్రవేశం చేసి వచ్చిన నా కోడలికి జవాబుదారిలా ఉండాలి అంటుంది సౌందర్య. చెప్పారా ఎవరికీ మంచివాడిలా ఉంటావు. ఎవరికీ చెడ్డవాడిలా ఉంటావు నా కోడలికా.. మోనిత కా అని నిలదీస్తుంది. రేపటి ఎపిసోడ్ లో దీపకు భాగ్య మోనిత కార్తీక్ ల పెళ్లి విషయం చెబుతుంది. దీప నిర్ణయం ఏమిటో చూడాలి మరి

Also Read: తల్లిదండ్రుల అందాన్ని సొంతం చేసుకున్న ఈ అబ్బాయి.. ఓ స్టార్ హీరో తనయుడు.. ఎవరో తెలుసా

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?