AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Star Hero Son: తల్లిదండ్రుల అందాన్ని సొంతం చేసుకున్న ఈ అబ్బాయి.. ఓ స్టార్ హీరో తనయుడు.. ఎవరో తెలుసా

Star Hero Son: అచ్చ తెలుగబ్బాయి.. శ్రీకర్ పేరుతో తెలుగులో ప్రేమ పుస్తకం సినిమాతో హీరోగా వెండి తెరపై అడుగు పెట్టాడు, అనంతరం ప్రేమలేఖ, వాలి వంటి సినిమాలతో కోలీవుడ్ లో...

Star Hero Son: తల్లిదండ్రుల అందాన్ని సొంతం చేసుకున్న ఈ అబ్బాయి.. ఓ స్టార్ హీరో తనయుడు.. ఎవరో తెలుసా
Ajith Son
Surya Kala
|

Updated on: Jun 30, 2021 | 7:48 AM

Share

Star Hero Son: అచ్చ తెలుగబ్బాయి.. శ్రీకర్ పేరుతో తెలుగులో ప్రేమ పుస్తకం సినిమాతో హీరోగా వెండి తెరపై అడుగు పెట్టాడు, అనంతరం ప్రేమలేఖ, వాలి వంటి సినిమాలతో కోలీవుడ్ లో స్టార్ హీరోగా ఫేమ్ సంపాదించుకున్నాడు. అభిమానులు ముద్దుగా తలా అని పిలుచుకునే ఫ్యామిలీ మ్యాన్ అజిత్ కుమార్.. 2000 లో ప్రముఖ నటి షాలిని పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఎప్పుడూ ఎక్కడ బయట కనిపించని అజిత్ వివాదాలకు దూరంగా ఉంటాడు అని అంటారు. అయితే ఇటీవల అజిత్ షాలిని తమ కుమారుడు ఆద్విక్ తో కలిసి ఇటీవల చెన్నైలోని ఒక ప్రముఖ హోటల్‌లో తళుక్కున మెరిశారు.

వీరిని గుర్తుపట్టిన హోటల్ సిబ్బంది.. ఒక ఫోటో తీసుకుంటామని అడిగింది. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ముఖ్యంగా చిన్నారి ఆద్విక్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. తల్లి దండ్రుల అందం అంతా ఆద్విక్ సొంతం అన్నట్లు ఉన్నాడు. తల్లి షాలిని ఒకప్పుడు బాలనటిగా తెలుగు, తమిళ సినిమాలో ఫేమస్.. తర్వాత హీరోయిన్ గా సఖి సినిమాతో అలరించింది.. తర్వాత అజిత్ తో సినిమా చేస్తున్న సమయంలో వీరిద్దరి పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు.

నాలుగు పదుల వయసు దాటిన అజిత్ స్వతహాగా నేచురల్ గానే ఉండడానికి నటించడానికి ఇష్టపడతాడు.. అందుకనే అందరి హీరోల్లా జుట్టు మొత్తం తెల్లబడినా.. ఏమాత్రం రంగు వేసుకోకుండా హీరో పాత్రలు పోషిస్తున్నాడు. అయినా అజిత్ కు ఎక్కడా ప్రేక్షకుల ఆదరణ తగ్గలేదు. మూడు సార్లు ఫిల్ం ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డులు పొందిన అజిత్ ప్రస్తుతం వలిమై షూటింగ్ ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు.

Ajith's son Aadvik Ajith's cute pictures go viral | Tamil Movie News - Times of India

Also Read: ఇంటర్ పాసై కంప్యూటర్ లో మంచి ప్రావీణ్యం ఉందా.. చక్కని వేతనంతో ప్రభుత్వ ఉద్యోగావకాశాలు