Avika Gor Birthday special: వానలో తడుస్తూ… చిందులేస్తున్న అందాల అవికా..

చిన్నారి పెళ్లి కూతురుగా బుల్లితెరపై తన రాణించిన చిన్నది అవకా గోర్. ఆతర్వాత హీరోయిన్ గా మారి ఉయ్యాలా జంపాల సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Avika Gor Birthday special: వానలో తడుస్తూ... చిందులేస్తున్న అందాల అవికా..
Avika Gor
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 30, 2021 | 11:54 AM

 Avika Gor : చిన్నారి పెళ్లి కూతురుగా బుల్లితెరపై తన రాణించిన చిన్నది అవకా గోర్. ఆతర్వాత హీరోయిన్ గా మారి ఉయ్యాలా జంపాల సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొదటి సినిమాతోనే నటి గా మంచి మార్కులు కొట్టేసింది అవికా. ఆతర్వాత మరోసారి రాజ్ తరుణ్ తో కలిసి సినిమా చూపిస్తా మామ మూవీలో నటించింది. ఈ రెండు సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఆతర్వాత నిఖిల్ నటించిన ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమాలో చేసింది ఈ సినిమా కూడా మంచి హిట్ ను అందుకుంది. ఆతర్వాత అవికాకు అనుకున్నంత హిట్లు పడలేదు దాంతో బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ పలు సినిమాల్లో నటించింది అయినా అంతగా సక్సెస్ కాలేక పోయింది. ఇప్పుడు తిరిగి తెలుగులో బిజీ అవ్వాలని చూస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ రైటర్ కం దర్శకుడు శ్రీధర్ సీపాన తెరకెక్కిస్తున్న తాజా చిత్రంలో నటిస్తోంది. మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

తాజాగా అవికా పుట్టిన రోజు కానుకగా ఈ మూవీ ఫస్ట్ గ్లిమ్స్ పేరుతో అవికాకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. అవిక బ్యూటిఫుల్ ఇంట్రడక్షన్ ను ఈ వీడియోలో చూపించారు. పింక్ పరికిణీలో వానవానలో తడుస్తూ డాన్స్ చేస్తూ అవికా మరింత అందంగా కనిపించింది. ఇక ఈ మూవీని  GA2 పిక్చర్స్ సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ -అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టి. జి. విశ్వ ప్రసాద్ -వివేక్ కుచిభోట్ల – అభిషేక్ అగర్వాల్ నిర్మాతలు. అనుప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Viral Video: పాట కోసం ఇండియన్ డిష్ ‘జిలేబీ’ తయారు చేసిన అమెరికన్ సింగర్..! వైరలవుతోన్న వీడియో

Rashmika mandanna : విజయ్ దేవరకొండతో ఉన్న రిలేషన్ గురించి ప్రశ్నించిన నెటిజన్.. రష్మిక సమాధానం ఏంటో తెలుసా..

Balakrishna : బాలయ్య బాబు కోసం అదిరిపోయే కథను సిద్దమా చేస్తున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్..