Allari Naresh : “సభకు నమస్కారం” అంటున్న అల్లరి హీరో.. నరేష్ నయా మూవీ

కామెడీ కంటెంట్ సినిమాలే కాదు ప్రయోగాత్మక సినిమాలు కూడా చేస్తూ అలరిస్తున్నాడు నరేష్. ఇటీవలే నాంది అనే సినిమాతో మరో సారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

Allari Naresh : సభకు నమస్కారం అంటున్న అల్లరి హీరో.. నరేష్ నయా మూవీ
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 30, 2021 | 1:09 PM

Allari Naresh :కామెడీ కంటెంట్ సినిమాలే కాదు ప్రయోగాత్మక సినిమాలు కూడా చేస్తూ అలరిస్తున్నాడు నరేష్. ఇటీవలే నాంది అనే సినిమాతో మరో సారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఛాలెంజింగ్ రోల్ లో నరేష్ జీవించాడనే చెప్పాలి.  విభిన్నమైన కథలను ఇక పై వదులుకోను అని గట్టిగా ఫిక్స్ అయ్యాడు నరేష్. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలను కమిట్ అవుతున్నాడు. ఈ క్రమంలోనే మరో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీతో రాబోతున్నాడు నరేష్. నేడు నరేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ప్రీలుక్ ను రిలీజ్ చేశారు. సభకు నమస్కారం అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమా నరేష్ కెరియర్ లో 58వ సినిమాగా రాబోతుంది. ఈ సినిమాతో మల్లంపాటి సతీష్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రచయిత అబ్బూరి రవి ఈ సినిమాకి సంభాషణలు రాస్తున్నారు.

ఇక ఈ సినిమా పోస్టర్ ను చాలా డిఫరెంట్ గా డిజన్ చేశారు. ఇందులో బ్యాక్ సైడ్ వ్యూలో నరేష్ మామైక్ ముందు నిలబడి.. రెండు చేతులు పైకెత్తి నమస్కారం పెడుతూ కనిపిస్తున్నాడు. అలాగే నరేశ్ బ్యాక్ పాకెట్ లో డబ్బులు – మరో పాకెట్ లో మందు బాటిల్ ఉన్నాయి. పోస్టర్ చూస్తుంటే ఈ సినిమా పొలిటికల్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది.   ‘సభకు నమస్కారం’ సినిమా షూటింగ్ సెప్టెంబర్ నెలలో ప్రారంభం కానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Akshay-Rakul : బాలీవుడ్ లో వరస అవకాశాలను అందుకుంటున్న రకుల్.. అక్షయ్ తో రొమాన్స్ చేసే ఛాన్స్

Kamal Haasan: నలుగురు విలన్లతో తలపడనున్న విశ్వనటుడు.. మక్కల్ సెల్వన్ పేరు కూడా వినిపిస్తుందే..

Tirumala – Boyapati: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బోయపాటి.. స్వామివారి సన్నిధిలో అఖండ రిలీజ్ పై క్లారిటీ