AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mokshagna : జూనియర్ సింహం వస్తుంది..! నందమూరి మోక్షజ్ఞ మెకోవర్ వీడియో.. ఫ్యాన్స్‌కు పూనకాలే

చిన్న పిల్లాడి నుంచి పండు ముసలోడి వరకు జై బాలయ్య అనాల్సిందే అంతలా అభిమానులను సొంతం చేసుకున్నారు బాలకృష్ణ. ఇక ఇప్పుడు బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. బాలయ్య వారసుడి ఎంట్రీ గురించి ఇప్పటికే చాలా  రకాల వార్తలు వచ్చాయి. బాలకృష్ణ కూడా మోక్షజ్ఞ ఎంట్రీని కన్ఫర్మ్ చేశారు.

Mokshagna : జూనియర్ సింహం వస్తుంది..! నందమూరి మోక్షజ్ఞ మెకోవర్ వీడియో.. ఫ్యాన్స్‌కు పూనకాలే
Nandamuri Mokshagna
Rajeev Rayala
|

Updated on: Jul 24, 2024 | 3:43 PM

Share

నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా వస్తుందట అభిమానులకు పండగే.. ఆయన స్క్రీన్ మీద కనిపించాడంటే పూనకాలే. ఇప్పటికీ యంగ్ హీరోలతో పోటీ పడుతూ.. సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు బాలయ్య. బాలకృష్ణకు ఫ్యాన్ కానీ తెలుగువాడు ఉండడు. చిన్న పిల్లాడి నుంచి పండు ముసలోడి వరకు జై బాలయ్య అనాల్సిందే అంతలా అభిమానులను సొంతం చేసుకున్నారు బాలకృష్ణ. ఇక ఇప్పుడు బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. బాలయ్య వారసుడి ఎంట్రీ గురించి ఇప్పటికే చాలా రకాల వార్తలు వచ్చాయి. బాలకృష్ణ కూడా మోక్షజ్ఞ ఎంట్రీని కన్ఫర్మ్ చేశారు. త్వరలోనే మా అబ్బాయి మోక్షజ్ఞ రాబోతున్నాడు అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చాయి.

ఇది కూడా చదవండి : వాడు ఓ పెద్ద ఫ్రాడ్..! సినిమా పేరుతో అతన్ని మోసం చేశాడు.. కిర్రాక్ ఆర్పీ బండారం బయటపెట్టిన షేకింగ్ శేషు

ఇదిలా ఉంటే తాజాగా మోక్షజ్ఞ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మొన్నటి వరకు కాస్త బొద్దుగా ఉన్న మోక్షజ్ఞ ఇప్పుడు హీరో లుక్ లోకి మారిపోయాడు. అతని మేకోవర్ చూసి స్టన్ అవుతున్నారు ఫ్యాన్స్. చాలా స్టైలిష్ గా, యంగ్ హీరోలకు గట్టిపోటీ ఇచ్చేలా కనిపిస్తున్నాడు బాలయ్య వారసుడు. ఈ క్రమంలో మోక్షజ్ఞ మేకోవర్ కు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో లో స్లిమ్‌గా, కూలింగ్ గ్లాస్ పెట్టుకొని యమా స్టైలిష్ గా ఉన్నాడు మోక్షజ్ఞ. దాంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Bigg Boss Telugu 8: బిగ్ బాస్ 8లో ఊహించని ఎంట్రీ.. హౌస్‌లో అడుగుపెట్టనున్న హాట్ బ్యూటీ..!

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది . నందమూరి అభిమానులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. జూనియర్ సింహం వచ్చేస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మోక్షజ్ఞను హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ పరిచయం చేయనున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ కాంబోలో మూవీని అనౌన్స్ చేయనున్నారు. అలాగే ఈ సినిమాను బాలకృష్ణ చిన్న కూతురు తేజేస్విని నిర్మిస్తున్నారు. అక్టోబరులో మోక్షజ్ఞ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ మూవీ కథ పై చర్చలు జరుగుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..