వాడు ఓ పెద్ద ఫ్రాడ్..! సినిమా పేరుతో అతన్ని మోసం చేశాడు.. కిర్రాక్ ఆర్పీ బండారం బయటపెట్టిన షేకింగ్ శేషు

కమెడియన్ చంటి టీమ్ లో స్కిట్స్ చేస్తూ ఆ తర్వాత టీమ్ లీడర్ గా ఎదిగాడు. ఆ సమయంలోనే ఆయన సినిమాలో ఆఫర్స్ కూడా అందుకున్నాడు. కొన్ని సినిమాల్లో కామెడీ పాత్రలు కూడా చేశాడు. ఆతర్వాత నెల్లూరి పెద్దారెడ్డి చేపల పులుసు అనే పేరుతో రెస్టారెంట్ ఓపెన్ చేశాడు. హైదరాబాద్ తరహా పలు నగరాల్లో ఈ రెస్టారెంట్ బ్రాంచెస్ ను ఓపెన్ చేసి బిజినెస్ మొదలు పెట్టాడు.

వాడు ఓ పెద్ద ఫ్రాడ్..! సినిమా పేరుతో అతన్ని మోసం చేశాడు.. కిర్రాక్ ఆర్పీ బండారం బయటపెట్టిన షేకింగ్ శేషు
Kirak Rp
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 24, 2024 | 3:11 PM

కిరాక్ ఆర్పీ.. జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో కిరాక్ ఆర్పీ ఒకడు. తన నెల్లూరి యాసతో కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను నవ్వించాడు కిరాక్ ఆర్పీ.. కమెడియన్ చంటి టీమ్ లో స్కిట్స్ చేస్తూ ఆ తర్వాత టీమ్ లీడర్ గా ఎదిగాడు. ఆ సమయంలోనే ఆయన సినిమాలో ఆఫర్స్ కూడా అందుకున్నాడు. కొన్ని సినిమాల్లో కామెడీ పాత్రలు కూడా చేశాడు. ఆతర్వాత నెల్లూరి పెద్దారెడ్డి చేపల పులుసు అనే పేరుతో రెస్టారెంట్ ఓపెన్ చేశాడు. హైదరాబాద్ తరహా పలు నగరాల్లో ఈ రెస్టారెంట్ బ్రాంచెస్ ను ఓపెన్ చేసి బిజినెస్ మొదలు పెట్టాడు. అలాగే ఈ మధ్యకాలంలో రాజకీయాల్లోకి దిగాడు. వైసీపీ నాయకుల పై కామెంట్స్ చేస్తూ ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలు వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఒకప్పుడు జబర్దస్త్ కు జడ్జ్ గా చేసిన రోజా పై కూడా ఆయన కామెంట్స్ చేశారు. అదేవిధంగా అల్లు అర్జున్ పై కూడా ఆర్పీ కామెంట్స్ చేశాడు. అల్లు అర్జున్ ఆర్మీ పై ఆయన కాంట్రవర్సి కామెంట్స్  చేశాడు.

ఇదికూడా చదవండి :  Naga Chaitanya: నాగచైతన్యకు అమ్మగా, ఫ్రెండ్‌గా, లవర్‌గా నటించిన ఏకైక హీరోయిన్ ఈమె..

అయితే తాజాగా కిరాక్ ఆర్పీ పై నటుడు, కమెడియన్ షేకింగ్ శేషు మండిపడ్డారు. అతను ఒక ఫ్రాడ్ అంటూ, ఓ నిర్మాతను నిండా ముంచాడు అని ఫైర్ అయ్యారు శేషు. ఓ ఇంటర్వ్యూలో ఆయన  మాట్లాడుతూ.. అప్పట్లో ఆర్పీ ఓ సినిమా తీస్తున్నా అంటూ హడావిడి చేశాడు. ఓ నిర్మాతను పట్టుకున్నాడు. ఆయన ఇక్కడ ఉండడు. జేడీ చక్రవర్తితో సినిమాను ఓపెన్ చేయించాడు. ఆ ఓపినింగ్ కు నాగబాబు కూడా వచ్చారు. పెద్ద సినిమాతీస్తున్నాడు అని మేము కూడా ఆనందపడ్డాం. కానీ హైదరాబాద్ లో సినిమా ఆఫీస్ ఒకటి రెంట్ కు తీసుకున్నాడు. దాని రెంట్ రూ.50 వేలు. సినిమానే మొదలు కాలేదు. అప్పుడే నిర్మాత చేత భారీగా ఖర్చు పెట్టించడం మొదలు పెట్టాడు. తీరా చూస్తే సినిమా మొదలవక ముందే రూ.20 లక్షల బిల్లు నిర్మాత చేతిలో పెట్టాడు. దాంతో ఆతను లబోదిమోమన్నాడు. “నన్ను నిండా ముంచావ్.. నువ్వొద్దు నీ సినిమా వద్దు.. సినిమా మొదలు పెట్టకుండానే 20 లక్షలు ఖర్చుపెట్టావు. నా డబ్బులు రిటన్ ఇచ్చేయ్” అంటూ గగ్గోలు పెట్టాడు.

ఇదికూడా చదవండి: Pawan Kalyan: ఈ ఫొటోలో పవర్ స్టార్‌తో ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా..? ఆమె ఎవరో తెలుసా..

ఆతర్వాత హోమ్ టూర్ పెద్ద ఫ్రాడ్. ఎవరిదో ఓ ఇంటిని చూపించి ఇది నా ఇల్లు దీని ఖరీదు మూడు కోట్లు.. ఇది నా బెడ్ రూమ్ అంటూ బడాయి చూపించాడు. నిజానికి అది వాడి ఇల్లు కాదు. ఎవరో కోటీశ్వరుడి ఇల్లు. ఇంటీరియర్ డిజైన్ చేస్తుంటే ఆ ఇల్లు చూపించి నాది అంటూ వ్యూస్ కోసం ఓ ఫ్రాడ్ చేశాడు అంటూ ఆర్పీ బండారాలు బయట పెట్టారు శేషు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.