Tollywood : ఈ నాన్న కూచి ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడు ఇండియానే షేక్ చేస్తున్న హీరోయిన్ ఆమె..

ఈ ఫోటోలో తండ్రితో కలిసి కనిపిస్తున్న క్యూట్ గర్ల్ ఎదుగుతూ.. సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఈ భామ సౌత్ సినిమాల్లో పవర్ ఫుల్ హీరోయిన్ గా మారిపోయింది. ఒకదాని తర్వాత ఒకటి అద్భుతమైన పాత్రలు చేస్తూ స్టార్ గా రాణిస్తుంది. అత్యధిక పారితోషికం తీసుకునే సౌత్ నటీమణులలో ఆమె ఒకరు. తెలుగు తమిళ్ సినిమాలతో పాటు ఇటీవలే బాలీవుడ్ లోకి కూడా అడుగు పెట్టింది.

Tollywood : ఈ నాన్న కూచి ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడు ఇండియానే షేక్ చేస్తున్న హీరోయిన్ ఆమె..
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 24, 2024 | 4:19 PM

నెట్టింట సినిమా హీరోయిన్స్ కు సంబందించిన ఫోటోలు వైరల్ అవ్వడం సర్వసాధారణం.. స్టార్ హీరోయిన్స్ కు సంబందించిన ఫోటోలను అభిమానులు తెగ షేర్ చేస్తూ ఉంటారు. అలాగే హీరోయిన్స్ కు సంబందించిన చిన్న నాటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక పైన కనిపిస్తున్న చిన్నారిని చూశారా.? ఈ ఫోటోలో తండ్రితో కలిసి కనిపిస్తున్న క్యూట్ గర్ల్ ఎదుగుతూ.. సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఈ భామ సౌత్ సినిమాల్లో పవర్ ఫుల్ హీరోయిన్ గా మారిపోయింది. ఒకదాని తర్వాత ఒకటి అద్భుతమైన పాత్రలు చేస్తూ స్టార్ గా రాణిస్తుంది. అత్యధిక పారితోషికం తీసుకునే సౌత్ నటీమణులలో ఆమె ఒకరు. తెలుగు తమిళ్ సినిమాలతో పాటు ఇటీవలే బాలీవుడ్ లోకి కూడా అడుగు పెట్టింది. రీసెంట్ గా ఆమె నటించిన సినిమా ఏకంగా 1000కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంతకు ఆ చిన్నారి ఎవరంటే..

ఇది కూడా చదవండి : వాడు ఓ పెద్ద ఫ్రాడ్..! సినిమా పేరుతో అతన్ని మోసం చేశాడు.. కిర్రాక్ ఆర్పీ బండారం బయటపెట్టిన షేకింగ్ శేషు

పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి మరెవరో కాదు ప్రముఖ  హీరోయిన్ నయనతార.  సూపర్ స్టార్స్ లిస్ట్ లో నయనతార ఒకరు. ఈ స్టార్ హీరోయిన్ కు లేడీ సూపర్ స్టార్ అనే బిరుదు ఉంది. బాలీవుడ్‌లోనూ ఈ బ్యూటీకిడిమాండ్ పెరిగింది. షారుఖ్ ‘జవాన్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది ఈ అమ్మడు. తొలి సినిమాతోనే బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకుంది. ఈ ఆముద్దుగుమ్మ చిన్నప్పటి ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది. నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్. 2003లో ‘మనసీనక్కరే’ అనే మలయాళ చిత్రంతో సినీ ప్రయాణం మొదలుపెట్టింది. మలయాళంలో కొన్ని సినిమాలు చేసిన తర్వాత తెలుగు, తమిళ చిత్రాల వైపు అడుగులేసింది. ‘అయ్యా’ ఆమె తొలి తమిళ చిత్రం. 2011లో ‘శ్రీరామరాజ్యం’ సినిమాలో ఆమె నటనకుగాను ఫిలింఫేర్ అవార్డు ఆడుకుంది. 2011కి ముందు నయనతార క్రిస్టియన్. 2011లో క్రిస్టియన్ మతాన్ని విడిచిపెట్టి హిందూ మతాన్ని స్వీకరించింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Bigg Boss Telugu 8: బిగ్ బాస్ 8లో ఊహించని ఎంట్రీ.. హౌస్‌లో అడుగుపెట్టనున్న హాట్ బ్యూటీ..!

స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవ్‌ను పెళ్లి చేసుకునేందుకే ఆమె హిందూ మతంలోకి మారిందని అప్పట్లో పెద్ద చర్చ నడిచింది. కానీ వారి బంధం ఎక్కువ కాలం నిలవలేకపోయింది. నయనతార 2022లో దర్శకుడు విఘ్నేష్ శివన్‌ని పెళ్లాడింది. ఆ తర్వాత సరోగసీ ద్వారా ఇద్దరు తల్లిదండ్రులు అయ్యారు. వీరికి కవలలు. ప్రస్తుతం సౌత్ లో అత్యంత రెమ్యునరేషన్ తీసుకుంటుంది నయనతార. ఒక్కో సినిమాకు 20 నుంచి 25 కోట్ల రూపాయలు వసూల్ చేస్తుంది. అలాగే  ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ లిస్ట్‌లో దాదాపు 200 కోట్ల నికర విలువ కలిగిన ఏకైక సౌత్ నటిగా నయనతార నిలిచింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రధాని మోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం!
ప్రధాని మోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం!
శ్మశానం దగ్గర పసివాడి ఏడుపు శబ్దం.. దగ్గరికెళ్లి చూడగానే షాక్.!
శ్మశానం దగ్గర పసివాడి ఏడుపు శబ్దం.. దగ్గరికెళ్లి చూడగానే షాక్.!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.