AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Dharam Tej: మెగా ఇంట్లో మళ్లీ పెళ్లి బాజాలు!ఆ హీరోయిన్‌తో సాయిధరమ్ తేజ్ ప్రేమ వివాహం! క్లారిటీ ఇచ్చిన టీమ్

సెలబ్రిటీల పెళ్లిళ్ల గాసిప్పులు రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఇది పరిపాటిగా మారింది. హీరో, హీరోయిన్లతో ముడి పెడుతూ డేటింగ్ వార్తలు సోషల్ మీడియాలో ఈ మధ్యన బాగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడీ లిస్టులో మెగా మేనల్లుడు, సుప్రీం హీరో, సాయి ధరమ్ తేజ్ కూడా చేరాడు.

Sai Dharam Tej: మెగా ఇంట్లో మళ్లీ పెళ్లి బాజాలు!ఆ హీరోయిన్‌తో సాయిధరమ్ తేజ్ ప్రేమ వివాహం! క్లారిటీ ఇచ్చిన టీమ్
Sai Dharam Tej
Basha Shek
|

Updated on: Jul 24, 2024 | 3:48 PM

Share

సెలబ్రిటీల పెళ్లిళ్ల గాసిప్పులు రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఇది పరిపాటిగా మారింది. హీరో, హీరోయిన్లతో ముడి పెడుతూ డేటింగ్ వార్తలు సోషల్ మీడియాలో ఈ మధ్యన బాగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడీ లిస్టులో మెగా మేనల్లుడు, సుప్రీం హీరో, సాయి ధరమ్ తేజ్ కూడా చేరాడు. ఎఫ్2 ఫేమ్ మెహరీన్ తో సాయి ధరమ్ తేజ్ ప్రేమలో ఉన్నాడని ,త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారంటూ పుకార్లు తెగ షికార్లు చేస్తున్నాయి. జవాన్ సినిమాలో వీరిద్దరూ జంటగా నటించారు. అప్పటినుంచే వీరి మధ్య పరిచయం ఏర్పడిందని, అది క్రమంగా ప్రేమగా మారిందని, ఇప్పుడు తమ రిలేషన్‌ను పెళ్లిగా మార్చాలని అనుకుంటున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే మేన మామలు మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ బిజీగా ఉండటం వల్ల పెళ్లి ముహుర్తాలు వాయిదా వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్త విన్న అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇంత సడెన్ గా సాయి ధరమ్ తేజ్ పెళ్లి చేసుకోవడమేంటి? అంటూ షాక్ అవుతున్నారు.

అవాస్తవాలు ప్రచారం చేయవద్దు..

తాజాగా ఇదే విషయంపై సాయి ధరమ్ తేజ్ టీమ్ స్పందించింది. హీరోయిన్ తో పెళ్లి వార్తలన్నీ రూమర్లేనని కొట్టి పారేసింది ‘ సాయి ధరమ్ తేజ్ పెళ్లి వార్తలన్నీ అబద్దాలే. హీరోయిన్‌తో వస్తున్న పెళ్లి వార్తలన్నింటిలో వాస్తవం లేదు. ఆయన పెళ్లి గురించి ఏదైనా విషయం ఉంటే మేమే అధికారికంగా ప్రకటిస్తాం. అంతే కానీ ఇలా అబద్ధాలను ప్రచారం చేయకండి’ సాయి ధరమ్ తేజ్ టీమ్ స్పందించింది. దీంతో మెగా హీరో పెళ్లి వార్తలు పుకార్లేనని తెలిసిపోయింది.

ఇవి కూడా చదవండి

సీఎం రేవంత్ రెడ్డితో సాయి ధరమ్ తేజ్..

ఇక సినిమాల విషయానికి వస్తే..

బైక్ యాక్సిడెంట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష, బ్రో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు తొలిసారి ఓ భారీ ప్రాజెక్టుతో మన ముందుకు రానున్నాడీ మెగా హీరో. హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి రూ. 120 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఆగస్టులో ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కనుందని సమాచారం. 2025లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
జస్ట్ ఆ హీరో ఫ్రెండ్ అని చెప్పా.. అంతే బ్యాంకాక్‌ ఆస్పత్రిలో ..
జస్ట్ ఆ హీరో ఫ్రెండ్ అని చెప్పా.. అంతే బ్యాంకాక్‌ ఆస్పత్రిలో ..
వెదర్‌ను బట్టి ట్రాఫిక్ సిగ్నల్స్.. త్వరలో సరికొత్త టెక్నాలజీ
వెదర్‌ను బట్టి ట్రాఫిక్ సిగ్నల్స్.. త్వరలో సరికొత్త టెక్నాలజీ
తిక్క కుదిరిందా? పది అడుగుల పాముతో ఏంటా పరాచకాలు
తిక్క కుదిరిందా? పది అడుగుల పాముతో ఏంటా పరాచకాలు
ఇంగ్లండ్‌తో పోరుకు బుడ్డోడు వద్దు.. పక్కనపెడితేనే మంచిది
ఇంగ్లండ్‌తో పోరుకు బుడ్డోడు వద్దు.. పక్కనపెడితేనే మంచిది
తెలంగాణలో మరో మూడు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడంటే..?
తెలంగాణలో మరో మూడు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడంటే..?
తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం! తెలుగు నేల నుంచే నింగిలోకి..
తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం! తెలుగు నేల నుంచే నింగిలోకి..
మహేష్ నటించిన ఆ సినిమాలో నా సీన్స్ కట్ చేశారు: హీరో సత్యదేవ్
మహేష్ నటించిన ఆ సినిమాలో నా సీన్స్ కట్ చేశారు: హీరో సత్యదేవ్
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!
అన్నదాతలకు గుడ్‌న్యూస్.. 2వ విడత రైతు భరోసా నిధులు విడుదల
అన్నదాతలకు గుడ్‌న్యూస్.. 2వ విడత రైతు భరోసా నిధులు విడుదల
వందల కోట్ల బడ్జెట్.. కానీ 1% సక్సెస్! మునుగుతున్న టాలీవుడ్‌!
వందల కోట్ల బడ్జెట్.. కానీ 1% సక్సెస్! మునుగుతున్న టాలీవుడ్‌!