Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: నువ్వు లేవంటే నమ్మలేకపోతున్నా.. నిన్ను కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది.. రష్మిక ఎమోషనల్ పోస్ట్

చాలా తక్కువ సమయంలోనే క్లిక్ అయిన రష్మిక ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. కన్నడ ఇండస్ట్రీలో కిరాక్ పార్టీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ వయ్యారి.. ఆతర్వాత తెలుగులో చలో సినిమాతో ప్రేక్షకులను పలకరించిన రష్మిక ఇప్పుడు పుష్ప తో దేశాన్నే ఊపేస్తోంది. అల్లు అర్జున్ తో కలిసి పుష్ప సినిమాలో ఇరగదీసింది ఈ అమ్మడు. సినిమా చూసిన వాళ్ళందరూ రష్మికాని తెగ పొగిడేశారు. పుష్ప రాజ్‌కు కరెక్ట్ జోడీ అంటూ కామెంట్స్ చేశారు.

Rashmika Mandanna: నువ్వు లేవంటే నమ్మలేకపోతున్నా.. నిన్ను కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది.. రష్మిక ఎమోషనల్ పోస్ట్
Rashmika
Rajeev Rayala
|

Updated on: Jul 18, 2024 | 7:39 AM

Share

స్టార్ హీరోయిన్ రష్మిక టాలీవుడ్ బాలీవుడ్ అని తేడాలు లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. హీరోలకు మించిన క్రేజ్ తో ఈ అమ్మడు రాణిస్తుంది. చాలా తక్కువ సమయంలోనే క్లిక్ అయిన రష్మిక ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. కన్నడ ఇండస్ట్రీలో కిరాక్ పార్టీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ వయ్యారి.. ఆతర్వాత తెలుగులో చలో సినిమాతో ప్రేక్షకులను పలకరించిన రష్మిక ఇప్పుడు పుష్ప తో దేశాన్నే ఊపేస్తోంది. అల్లు అర్జున్‌తో కలిసి పుష్ప సినిమాలో ఇరగదీసింది ఈ అమ్మడు. సినిమా చూసిన వాళ్ళందరూ రష్మికాని తెగ పొగిడేశారు. పుష్ప రాజ్‌కు కరెక్ట్ జోడీ అంటూ కామెంట్స్ చేశారు. అలాగే గత ఏడాది యానిమల్ సినిమాతో అదరగొట్టింది. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమాలో కూడా రష్మిక తన నటనతో అందంతో ఆకట్టుకుంది. అలాగే రొమాంటిక్ సీన్స్‌లోనూ రెచ్చిపోయి నటించింది.

ఇకపోతే రష్మిక సినిమాల్లోనే కాదు సోషల్ మీడియా సెన్సేషన్ కూడా.. ఈ అమ్మడు ఎప్పుడెప్పుడు పోస్ట్ పెడుతుందా లైక్ కొడదాం.! షేర్ చేద్దాం అని కొంతమంది ఫ్యాన్స్ ఈగర్‌గా ఎదురుచూస్తూ ఉంటారు. అలాగే ఈ ముద్దుగుమ్మ ఫోటోలకు కూడా నెట్టింట భలే క్రేజ్ ఉంది. తన సినిమా అప్డేట్స్ తో పాటు పర్సనల్ విషయాలు కూడా పంచుకుంటూ ఉంటుంది రష్మిక. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ఈ పోస్ట్ ప్రతిఒక్కరిని కదిలిస్తుంది.

తన పెట్ డాగ్ చనిపోవడంతో ఎమోషనల్ అయ్యింది రష్మిక. ఎంతో ఇష్టంగా పెంచుకున్న కుక్క చనిపోవడంతో రష్మిక భావోద్వేగానికి గురయ్యింది. తన కుక్క ఫోటోను షేర్ చేస్తూ.. ‘ప్రశాంతంగా ఉండు నా లిల్ గూడెస్ట్ బోయియీ మాక్సి. మేము నిన్ను ఎంతో మిస్ అవుతున్నాము. నిన్ను పోగొట్టుకున్నందుకు చాలా బాధగా ఉంది. మనం త్వరలో ఒకరినొకరు కలుసుకుంటామని నేను నిజంగా ఆశిస్తున్నాను’’ అంటూ తన సోషల్ మీడియాలో రాసుకొచ్చింది రష్మిక. ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఈ పోస్ట్ పై నెటిజన్స్, రష్మిక ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Rashmika New

రష్మిక మందన్న ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.