AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venu Swamy: వేణుస్వామితో సముద్రఖని ప్రత్యేక పూజలు.. ప్రసాదంగా చేపల కూర, మటన్.. వీడియో వైరల్

సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటారు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి. అలాగే స్టార్ హీరోలు, హీరోయిన్లతోనూ పూజలు, పునస్కారాలు చేయిస్తుంటారాయన. ఈ మధ్యన వేణు స్వామి చెబుతోన్న జాతకాలు తప్పుతున్నాయి. విమర్శలు కూడా వస్తున్నాయి. నెట్టంట స్వామీజీపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది

Venu Swamy: వేణుస్వామితో సముద్రఖని ప్రత్యేక పూజలు.. ప్రసాదంగా చేపల కూర, మటన్.. వీడియో వైరల్
Samuthirakani, Venu Swamy
Basha Shek
|

Updated on: Jul 18, 2024 | 7:33 AM

Share

సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటారు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి. అలాగే స్టార్ హీరోలు, హీరోయిన్లతోనూ పూజలు, పునస్కారాలు చేయిస్తుంటారాయన. ఈ మధ్యన వేణు స్వామి చెబుతోన్న జాతకాలు తప్పుతున్నాయి. విమర్శలు కూడా వస్తున్నాయి. నెట్టంట స్వామీజీపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది. అయితే కొందరు సినిమా సెలబ్రిటీలు మాత్రం వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించుకోవడానికి ఆసక్తి చూపిస్తూనే ఉన్నారు. స్టార్ హీరోలు, హీరోయిన్లు సైతం వేణు స్వామి తో పూజలు చేయించుకుంటున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని కూడా చేరిపోయారు. ప్రముఖ కామాఖ్య దేవాలయంలో వేణు స్వామి చేతుల మీదుగా ప్రత్యేక పూజలు చేయించుకున్నారు సముద్ర ఖని. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు వేణు స్వామి. పూజలకు సంబంధించిన వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన ఆయన ‘కామాఖ్య దేవాలయంలో ఈరోజు స్పెషల్ పూజ అనంతరం మహా ప్రసాదంలో భాగంగా చేపల కూర, మటన్ కూరను ప్రసాదంగా తీసుకురావడం జరిగింది. ఈ రోజు కామాఖ్య దేవాలయంలో దర్శకులు, నటులు సముద్రఖని గారి పూజ కూడా చాలా వైభవంగా జరిగింది’ అని రాసుకొచ్చారు.

వేణు స్వామి షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా కామెంట్లు చేస్త్ఉన్నారు. చేపల కూర, మటన్ కూర ప్రసాదమని చెప్పడంపై చాలా మంది నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై కూడా ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ ఇచ్చారు వేణు స్వామి. ‘ఈరోజు కొండపైన కామాఖ్య దేవాలయంలో మానసా దేవి పూజ. వారాహి నవరాత్రిలో భాగంగా.. 16, 17, 18, 19 ఈ నాలుగు రోజులు ప్రత్యేకమైన రోజులు. మానసా దేవి పూజ కాబట్టి.. ఫిష్ కర్రీ చేశారు. రెగ్యులర్‌గా ఇక్కడ మటర్ కర్రీ నైవేద్యంగా పెడుతుంటారు. మెయిన్ టెంపుల్ అమ్మ వారికి నైవేద్యంగా పెట్టిన మటన్ కూర దొరకడం అంటే భోగం అనే చెప్పాలి. ఇది సాధారణంగా బయటకు రాదు. మాకు అమ్మవారి దయవల్ల.. సముద్రఖని గారికి భాగ్యం ఉంది కాబట్టి తినేయోగం ఉంది కాబట్టి ఇది లభించింది’ అని చెప్పుకొచ్చారు వేణు స్వామి.

ఇవి కూడా చదవండి

కామాఖ్య ఆలయంలో సముద్ర ఖని, వేణు స్వామి పూజలు.. వీడియో ఇదిగో..

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ