AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

R Narayana Murthy: ‘ఆందోళన చెందవద్దు.. అప్పుడే అన్ని వివరాలు చెబుతా’.. హెల్త్ అప్డేట్ ఇచ్చిన నారాయణ మూర్తి

ప్రముఖ టాలీవుడ్ నటుడు, 'పీపుల్ స్టార్' ఆర్. నారాయణ మూర్తి అస్వస్థతకు గురయ్యారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన బుధవారం (జులై 17) హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చేరారు. నారాయణ మూర్తి ఉన్నట్లుండి ఆస్పత్రిలో చేరడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు

R Narayana Murthy: 'ఆందోళన చెందవద్దు.. అప్పుడే అన్ని వివరాలు చెబుతా'.. హెల్త్ అప్డేట్ ఇచ్చిన నారాయణ మూర్తి
R Narayana Murthy
Basha Shek
|

Updated on: Jul 18, 2024 | 6:46 AM

Share

ప్రముఖ టాలీవుడ్ నటుడు, ‘పీపుల్ స్టార్’ ఆర్. నారాయణ మూర్తి అస్వస్థతకు గురయ్యారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన బుధవారం (జులై 17) హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చేరారు. నారాయణ మూర్తి ఉన్నట్లుండి ఆస్పత్రిలో చేరడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు కూడా పీపుల్ స్టార్ ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. దీంతో స్వయంగా ఆర్ నారాయణ మూర్తే తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఒక ప్రకటన విడుదల చేశారు.’ప్రస్తుతం నేను నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాను. దేవుడి దయతో త్వరగానే కోలుకుంటున్నాను. పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తాను. అప్పుడు అన్ని వివరాలు చెబుతాను. ఎవరూ నా ఆరోగ్యం గురించి ఆందోళన చెందవద్దు’ అని నారాయణ మూర్తి తెలిపారు.

మరోవైపు నిమ్స్ ఆస్పత్రి వైద్యులు కూడా నారాయణ మూర్తి ఆరోగ్యంపై స్పందించారు. నారాయణ మూర్తి స్వల్ప అస్వస్థతకు లోనయ్యారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. చికిత్స అందిస్తున్నాం. నారాయణ మూర్తి క్రమంగా కోలుకుంటున్నారు. ఆయన నిర్వహించినవి కూడా సాధారణ టెస్టులే’ నని నిమ్స్ వైద్యులు ప్రకటించారు. ఇక నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఆర్ నారాయణ మూర్తి సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ముఖ్యంగా విప్లవాత్మక సినిమాలు తీయడంలో ఆయనది అందెవేసిన చేయి.ప్రజా సమస్యలే ఇతివృత్తంగా నారాయణ మూర్తి తీసిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఎంతో మంది అభిమానులను సంపాదించి పెట్టాయి. అభిమానుల గుండెల్లో ‘పీపుల్ స్టార్’ గా చెరగని ముద్ర వేసుకున్న నారాయణ మూర్తి ఒకప్పుడు యాక్టివ్ గా సినిమాలు చేసేవారు. అయితే ఇప్పుడు బాగా సినిమాలను తగ్గించేశారు. ప్రస్తుతం ఉక్కు సత్యాగ్రహం తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఆస్పత్రి బెడ్ పై నారాయణ మూర్తి..

నారాయణ మూర్తి ప్రకటన..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బీసీసీఐకి ఇండిగో చుక్కలు..పుణె వైపు పరుగులు పెట్టిన ప్లేయర్లు
బీసీసీఐకి ఇండిగో చుక్కలు..పుణె వైపు పరుగులు పెట్టిన ప్లేయర్లు
బెల్లం ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది..? మీరు చేసే తప్పులతో..
బెల్లం ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది..? మీరు చేసే తప్పులతో..
రతన్ టాటా సవతి తల్లి కన్నుమూత.. అమె గురించి తెలిస్తే షాకవుతారు!
రతన్ టాటా సవతి తల్లి కన్నుమూత.. అమె గురించి తెలిస్తే షాకవుతారు!
పుతిన్‌తో మోదీ భేటీ… భారత్–రష్యా బంధానికి కొత్త దిక్సూచి
పుతిన్‌తో మోదీ భేటీ… భారత్–రష్యా బంధానికి కొత్త దిక్సూచి
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..