- Telugu News Photo Gallery Cinema photos Know Aishwarya Rai Richer Than most Tops Male Actors in India
Aishwarya Rai: భారతదేశంలోనే రిచెస్ట్ హీరోయిన్.. హీరోల కంటే ఎక్కువగా సంపాదిస్తున్న బ్యూటీ..
ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో హీరోలతోపాటు హీరోయిన్స్ కూడా అత్యధిక పారితోషికం తీసుకుంటున్నారు. కొందరు నటీమణులు ఇప్పుడు స్టార్ హీరోస్ కంటే ఎక్కువగా సంపన్నులు. భారతదేశంలోనే అత్యంత సంపన్న నటి (రిచెస్ట్ హీరోయిన్) ఐశ్వర్య రాయ్. భారతదేశంలోనే రిచెస్ట్ హీరోయిన్గా ఉన్న ఐశ్వర్య రాయ్ నికర విలువ రూ.862 కోట్లు.
Updated on: Jul 24, 2024 | 2:14 PM

ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో హీరోలతోపాటు హీరోయిన్స్ కూడా అత్యధిక పారితోషికం తీసుకుంటున్నారు. కొందరు నటీమణులు ఇప్పుడు స్టార్ హీరోస్ కంటే ఎక్కువగా సంపన్నులు. భారతదేశంలోనే అత్యంత సంపన్న నటి (రిచెస్ట్ హీరోయిన్) ఐశ్వర్య రాయ్.

భారతదేశంలోనే రిచెస్ట్ హీరోయిన్గా ఉన్న ఐశ్వర్య రాయ్ నికర విలువ రూ.862 కోట్లు. తోటి నటీమణులనే కాకుండా చాలా మంది మేల్ స్టార్స్ కూడా అధిగమించింది. లాభదాయకమైన అంతర్జాతీయ బ్రాండ్ ఎండార్స్మెంట్ లతోపాటు బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్స్ అందుకుంది.

ప్రస్తుతం ఐశ్వర్య రాయ్ రూ.862 కోట్లు సంపాదించగా.. ప్రియంక చోప్రా రూ.650 కోట్లు, అలియా భట్ రూ.550 కోట్లు, దీపికా పదుకొణే రూ.500 కోట్లు, కరీనా కపూర్ రూ.485 కోట్లు, కత్రినా కైఫ్ రూ.250 కోట్లు, నయనతార రూ.200 కోట్లు సంపాదించారు.

చాలాకాలం తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఐశ్వర్య ఇటీవల మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమా కోసం రూ.15 కోట్లకు పైగా పారితోషికం తీసుకున్నట్లు టాక్. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 10 కోట్లు పారితోషికం తీసుకుంటుంది.

అలాగే బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా రోజుకు రూ. 6-7 కోట్ల ఆదాయం వస్తుంది. ఆమె భర్త అభిషేక్ బచ్చన్ కంటే మూడు రెట్లు ధనవంతురాలు ఐశ్వర్య. అభిషేక్ నికర విలువ రూ.280 కోట్లు. రణబీర్ కపూర్ రూ.345 కోట్లు, ప్రభాస్ రూ.200 కోట్లు, రణవీర్ సింగ్ రూ.500 కోట్లు.




