- Telugu News Photo Gallery Cinema photos Rashmika Mandanna's Pushpa 2 and Chhava Movie Will Release On Same Day
Rashmika Mandanna: రష్మిక నటించిన రెండు భారీ బడ్జెట్ సినిమాలు ఒకేరోజు రిలీజ్.. పుష్పతోపాటు ఆ సినిమా..
నేషనల్ క్రష్ రష్మిక మందన్న చాలా సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పుడు మరో సినిమాకు ఒప్పుకోవడానికి కూడా ఎంతో కష్టం. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో ఆమె నటిస్తున్న 'పుష్ప 2' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కొన్ని కారణాల వల్ల సినిమా రిలీజ్ డేట్ డిసెంబర్ కి వాయిదా పడింది. ఈ సినిమాతోపాటు 'చావా' అనే సినిమాలో నటిస్తుంది. ఇప్పుడు రష్మిక నటించిన ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదలయ్యే అవకాశం ఉంది.
Updated on: Jul 24, 2024 | 1:54 PM

నేషనల్ క్రష్ రష్మిక మందన్న చాలా సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పుడు మరో సినిమాకు ఒప్పుకోవడానికి కూడా ఎంతో కష్టం. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో ఆమె నటిస్తున్న 'పుష్ప 2' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కొన్ని కారణాల వల్ల సినిమా రిలీజ్ డేట్ డిసెంబర్ కి వాయిదా పడింది.

ఈ సినిమాతోపాటు 'చావా' అనే సినిమాలో నటిస్తుంది. ఇప్పుడు రష్మిక నటించిన ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదలయ్యే అవకాశం ఉంది. 'పుష్ప 2' సినిమా ఆగస్ట్ 15న విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ సినిమాను డిసెంబర్ 6న విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది.

అలాగే రష్మిక నటించిన 'చావా' కూడా డిసెంబర్ 6న విడుదల కానుందని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో విక్కీ కౌశల్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రం ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ గురించి ఉండనుంది. డిసెంబరు 6న 'చావా' విడుదలవుతుందని గతంలోనే చెప్పారు.

పుష్ప 2 రిలీజ్ డేట్ మారడంతో చావా సినిమా విడుదల వాయిదా పడుతుందని అనుకున్నారంతా. కానీ ముందుగా అనుకున్నట్టుగానే ఈ సినిమా డిసెంబర్ 6న విడుదల కానుందని అంటున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఆగస్ట్ 15న విడుదల కానుంది.

ఆగస్ట్ 15న ‘స్త్రీ 2’ సినిమా విడుదలవుతోంది. ఈ సినిమాతో పాటు ‘చావా’ సినిమా గ్లింప్స్‌ని అనుబంధంగా ప్రసారం చేయనున్నారు. లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 'మద్యక్ ఫిల్మ్స్' ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పుడు 'పుష్ప 2', 'చావ' సినిమాలు ఒకే రోజు విడుదల కానున్నాయి.




