Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ANR Birth Anniversary: నాగేశ్వర్ రావు జీవితాంతం నటించారు.. ఎమోషనల్ అయిన నాగార్జున, నాగ చైతన్య

75 ఏళ్లు సినీ కళ్ళామ్మ తల్లికి సేవలందించారు నాగేశ్వరావు. ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించి తెలుగు సినిమా ఖ్యాతిని పెంచారు అక్కినేని. నేడు అక్కినేని  శతజయంతి  సందర్భంగా ఆయనను తలుచుకుంటూ.. ఆయనకు నివాళులు అర్పిస్తూ సినీ తారలు, అక్కినేని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ లి పెడుతున్నారు. ఇక అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏర్పాటు చేసిన అక్కినేని నాగేశ్వరావు విగ్రహాన్ని భారత మాజీ ఉప రాష్ట్రపతి యం. వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు.

ANR Birth Anniversary: నాగేశ్వర్ రావు జీవితాంతం నటించారు.. ఎమోషనల్ అయిన నాగార్జున, నాగ చైతన్య
Anr
Follow us
Rajeev Rayala

| Edited By: Basha Shek

Updated on: Sep 20, 2023 | 2:11 PM

లెజెండ్రీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరావు శతజయంతి నేడు. ఈ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగేశ్వరరావు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఆయన వారసులు. 75 ఏళ్లు సినీ కళ్ళామ్మ తల్లికి సేవలందించారు నాగేశ్వరావు. ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించి తెలుగు సినిమా ఖ్యాతిని పెంచారు అక్కినేని. నేడు అక్కినేని  శతజయంతి  సందర్భంగా ఆయనను తలుచుకుంటూ.. ఆయనకు నివాళులు అర్పిస్తూ సినీ తారలు, అక్కినేని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ లి పెడుతున్నారు. ఇక అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏర్పాటు చేసిన అక్కినేని నాగేశ్వరావు విగ్రహాన్ని భారత మాజీ ఉప రాష్ట్రపతి యం. వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్కినేని కుటుంబ సభ్యులు చొరవ తీసుకుని నాగేశ్వర్ రావు విగ్రహ నెలకొల్పడం గొప్ప విషయం అన్నారు.

అలాగే నాగేశ్వర్ రావు అంటే నాకు చాలా అభిమానం. అక్కినేని మహా నటుడు.. మహా మనిషి. నాగేశ్వర్ రావు జీవితాంతం నటించారు. సినిమా రంగంలో విలువలు పాటించిన మహా వ్యక్తి అక్కినేని నాగేశ్వరావు. ఇప్పుడు నాకు తెలుగు కనుమరుగు అవుతుందనే భయం కలుగుతుంది. భాష పోతే శ్వాస పోతుంది, భాష పోతే సినిమా, పత్రిక, మీడియా చానల్స్ ఉండవు అని అన్నారు వెంకయ్య నాయుడు. సినీ పరిశ్రమకు రెండు కళ్లు ఎన్టీఆర్, ఏఎన్నార్. అక్కినేని ఒక నటన విశ్వ విద్యాలయం. ఆయన  పెద్దగా చదువుకోకపోయిన జీవితాలను చదివారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి పోటీ ప్రపంచంలో నిలదొక్కుకున్నారు అని కొనియాడారు వెకయ్యనాయుడు. సినిమా ఒక సందేశాన్ని, విజ్ఞాన్ని అందించాలి. అక్కినేని ప్రతి సినిమాల్లో సందేశం ఉండేది. అక్కినేని స్ఫూర్తితో సినిమాలు తీయాల్సి ఉంది. ఈ మధ్య సినిమాల్లో వాడుతున్న భాష బాగా లేదు అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

అలాగే కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. నాన్న మాకు ఎంతో ప్రేమను అందించారు. బాధేసిన, సంతోషం వేసిన నాన దగ్గరికి వెళ్లి పంచుకునే వాళ్ళం అని అన్నారు. మా కుటుంబానికి పెద్ద దిక్కు వెంకయ్య నాయుడు. ఎప్పుడు ఆహ్వానించిన వెంకయ్య నాయుడు తప్పకుండా వస్తారు. నాన్నకు అన్నపూర్ణ స్టూడియో అంటే మహా ఇష్టం. నాన్నకు ఇష్టమైన అన్నపూర్ణ స్టూడియోలో విగ్రహం పెట్టాం అని అన్నారు. సహజ నటి జయసుధ మాట్లాడుతూ.. అక్కినేనితో చిన్న పాత్రతో నా నటన ప్రారంభమైంది. ఎక్కువ చిత్రాల్లో అక్కినేని పక్కన కథానాయికగా నటించడం నా అదృష్టం అన్నారు. అలాగే అక్కినేని నాగేశ్వరావు గారి దగ్గర క్రమశిక్షణ నేర్చుకున్నా.. అలాగే ఆ సమయంలో తెలుగు నేర్చుకోవాలని సూచించారు అని తెలిపారు జయసుధ. అక్కినేని మనవడు నాగ చైతన్య మాట్లాడుతూ .. మనం సినిమాలో తాత గారితో కలిసి నటించడం నా సంతోషం.. అక్కినేని నాగేశ్వరరావు మనవుడి గా పుట్టడం నా అదృష్టం. ఆయన ఎప్పుడు నాలోపల ఓ దీపంలా వెలుగుతూ ఉంటారు అని అన్నారు.

నాగార్జున స్పీచ్..

నాగ చైతన్య స్పీచ్ ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.