Navdeep: సహకరిస్తే సరేసరి లేకుంటే అరెస్ట్ చేస్తాం.. నవదీప్‌కు వార్నింగ్ ఇచ్చిన పోలీసులు

41ఏ కింద నవదీప్‌కు నోటీసులు ఇవ్వాలన్న హైకోర్టు ఆదేశించింది. అలాగే  విచారణకు హాజరుకావాలని నవదీప్‌కు హైకోర్టు ఆదేశించింది.అదేవిధంగా నవదీప్‌పై గతంలోనూ డ్రగ్స్ కేసులు ఉన్నాయని పోలీసులు హైకోర్టుకు తెలిపారు. గతంలో ఉన్న డ్రగ్స్ కేసుల్లో నవదీప్ నిందితుడిగా లేడని అతని తరపు న్యాయవాది సిద్దార్థ్ వాదించారు. గతంలోనూ దర్యాప్తు సంస్థల ముందు నవదీప్ హాజరయ్యారని తెలిపారు అడ్వకేట్ సిద్దార్థ్. మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్‌కు ఎలాంటి సంబంధం లేదని అడ్వకేట్ గట్టిగానే వాదించారు.

Navdeep: సహకరిస్తే సరేసరి లేకుంటే అరెస్ట్ చేస్తాం.. నవదీప్‌కు వార్నింగ్ ఇచ్చిన పోలీసులు
Navadeep
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 20, 2023 | 11:58 AM

హీరో నవదీప్‌కు హైకోర్టులో షాక్‌ తగిలింది. డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. నవదీప్ పేరు బయటకు రావడం ఇప్పుడు కొత్తేమి కాదు గతంలో చాలా సార్లు డ్రస్ వ్యవహారంలో నవదీప్ పేరు వినిపించింది. మొన్నీమధ్య సీపీ నవదీప్ డ్రగ్స్ వాడకంలో నవదీప్ పేరును ప్రస్తావించారు కూడా. కానీ అది తాను కాదు అంటూ బుకాయించే ప్రయత్నం చేశాడు. కానీ మనోడి పప్పులు ఉడకలేదు. తాజాగా నవదీప్‌ పిటిషన్‌ పై హైకోర్టు విచారణ ముగిసింది.

41ఏ కింద నవదీప్‌కు నోటీసులు ఇవ్వాలన్న హైకోర్టు ఆదేశించింది. అలాగే  విచారణకు హాజరుకావాలని నవదీప్‌కు హైకోర్టు ఆదేశించింది.అదేవిధంగా నవదీప్‌పై గతంలోనూ డ్రగ్స్ కేసులు ఉన్నాయని పోలీసులు హైకోర్టుకు తెలిపారు. గతంలో ఉన్న డ్రగ్స్ కేసుల్లో నవదీప్ నిందితుడిగా లేడని అతని తరపు న్యాయవాది సిద్దార్థ్ వాదించారు. గతంలోనూ దర్యాప్తు సంస్థల ముందు నవదీప్ హాజరయ్యారని తెలిపారు అడ్వకేట్ సిద్దార్థ్. మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్‌కు ఎలాంటి సంబంధం లేదని అడ్వకేట్ గట్టిగానే వాదించారు.

డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ డ్రామా ఆడుతున్నదంటున్నారు పోలీసులు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో తనకు ఏమి సంబంధం లేదంటూ మొదట బుకాయించాడు నవదీప్. పోలీసులు ఎందుకు తన పేరు చెప్పారో తెలియడం లేదని, మీడియా సమావేశంలో పోలీసులు తెలిపిన పేరు తనది కాదంటూ సోషల్ మీడియా లో పోస్ట్ లు పెట్టుకొచ్చాడు ఈ యంగ్ హీరో. అయితే నవదీప్ ఇంట్లో ర్కోటిక్ పోలీసులు సోదాలు నిర్వహించారు. దాంతో ఆయన హైకోర్టు ను ఆశ్రయించాడు. అయితే పోలీసుల దర్యాప్తు కు నవదీప్ స్పందించడం లేదు. హైకోర్టు ఆదేశాల తో పోలీసుల విచారణకు సహకరిస్తాడా? లేదా అన్నది తెలియడం లేదు. నవదీప్ డ్రగ్స్ కన్స్యూమ్ చేసినట్టు నార్కోటిక్ వద్ద సరిపడా ఆధారాలు ఉన్నాయని తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో నవదీప్ సహకరించకుంటే అరెస్ట్ చేస్తామని నార్కోటిక్ పోలీసులు తెలిపారు.

నవదీప్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Sonu Sood (@sonu_sood)

నవదీప్ ట్విట్టర్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.