Chiranjeevi: తెలుగు సినిమాకే కాదు ఆయన భారతీయ సినీ చరిత్ర లోనే ఓ దిగ్గజ నటుడు.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్

అక్కినేని వారసులు నాగార్జున, సుమంత్, సుశాంత్, నాగచైతన్య, అఖిల్ ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి జరిపిస్తున్నారు. తెలుగు సినీ చరిత్రకు నాగేశ్వరరావు మూలస్థంభం లాంటివారు. ఎన్నో అద్భుత సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. దాదాపు 75 ఏళ్ళు సినీ రంగానికి సేవలందించారు. ఎలాంటి పాత్రయినా ఇట్టే ఒదిగిపోయి ప్రేక్షలను మెప్పించారు. నేడు ఆయన శత జయంతి సందర్భంగా చాలా మంది సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా  అక్కినేనికి నివాళ్లు అర్పిస్తూ పోస్ట్ లు షేర్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా అక్కినేని పై ఉన్న ప్రేమను సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

Chiranjeevi: తెలుగు సినిమాకే కాదు ఆయన భారతీయ సినీ చరిత్ర లోనే ఓ దిగ్గజ నటుడు.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
Chiranjeevi
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 20, 2023 | 11:35 AM

అక్కినేని నాగేశ్వరావు శత జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ఏఎన్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కినేని వారసులు నాగార్జున, సుమంత్, సుశాంత్, నాగచైతన్య, అఖిల్ ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి జరిపిస్తున్నారు. తెలుగు సినీ చరిత్రకు నాగేశ్వరరావు మూలస్థంభం లాంటివారు. ఎన్నో అద్భుత సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. దాదాపు 75 ఏళ్ళు సినీ రంగానికి సేవలందించారు. ఎలాంటి పాత్రయినా ఇట్టే ఒదిగిపోయి ప్రేక్షలను మెప్పించారు. నేడు ఆయన శత జయంతి సందర్భంగా చాలా మంది సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా  అక్కినేనికి నివాళ్లు అర్పిస్తూ పోస్ట్ లు షేర్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా అక్కినేని పై ఉన్న ప్రేమను సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.

“శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆప్యాయంగా, గౌరవపూర్వకంగా ఆ మహానటుడికి నివాళులర్పిస్తున్నాను. ఆయన తెలుగు సినిమా కే కాదు భారతీయ సినీ చరిత్ర లోనే ఓ దిగ్గజ నటుడు. ఆయన నటించిన వందలాది చిత్రాల ద్వారా ఆయన నటనా పటిమ, తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. తెలుగు సినిమా బ్రతికినంత వరకు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో ఎప్పటికీ నిలిచి వుంటారు. ఆ మహానుభావుడి శత జయంతి సందర్భంగా శ్రీ అక్కినేని కుటుంబంలోని ప్రతి ఒక్కరికి , నా సోదరుడు నాగార్జున కు అలాగే నాగేశ్వరరావుగారి కోట్లాది అభిమానులకు, సినీ ప్రేమికులందరికీ నా హృదయ పూర్వక శుభాకాంక్షలు ” అని రాసుకొచ్చారు మెగాస్టార్. 

చిరంజీవి నాగేశ్వరరావు కలిసి మెకానిక్ అల్లుడు సినిమాలో నటించారు ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అంతే కాదు మెగాస్టార్ చిరంజీవి అక్కినేని ఫ్యామిలీతో చాలా సన్నిహితంగా ఉంటారు. నాగార్జున, చిరంజీవి ఒకే జనరేషన్ హీరోలు కావడమతోపాటు మంచి మిత్రులుగా ఉంటారు. అలాగే మెగాస్టార్ కుటుంబంతో అక్కినేని కుటుంబం కూడా ఎంతో సన్నిహితంగా ఉంటారు.

మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ పోస్ట్ ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.