Akkineni Nageswara Rao: అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి.. ఏఎన్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన వెంకయ్య నాయుడు
నటనలో తనకు తానే సాటి అని నిరూపించుకున్న వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు, నేడు ఆ మహానటుడు శతజయంతి. ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించి తెలుగు సినిమా కీర్తిని ఆకాశానికి చేర్చారు అక్కినేని. ఎలాంటి పాత్రైనా సరే ప్రాణం పోసి జీవించేవారు అక్కినేని నాగేశ్వరరావు. తెలుగు సినిమా చరిత్ర అంటే ముందుగా గుర్తొచ్చేదో ఎన్టీఆర్ , ఎన్నాఆర్ పేర్లే.. ఒక రైతు కుటుంబంలో పుట్టి, నాటకరంగం ద్వారా వెండితెర వైపు అడుగులేశారు నాగేశ్వరరావు.
తెలుగు సినిమా చరిత్రలో ఆయన పేరు సువర్ణాక్షరాలతో లికించబడింది. ఆయన నటనకు తెలుగు కళ్ళామ్మ తల్లే మురిసిపోయింది. నటనలో తనకు తానే సాటి అని నిరూపించుకున్న వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు, నేడు ఆ మహానటుడు శతజయంతి. ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించి తెలుగు సినిమా కీర్తిని ఆకాశానికి చేర్చారు అక్కినేని. ఎలాంటి పాత్రైనా సరే ప్రాణం పోసి జీవించేవారు అక్కినేని నాగేశ్వరరావు. తెలుగు సినిమా చరిత్ర అంటే ముందుగా గుర్తొచ్చేదో ఎన్టీఆర్ , ఎన్నాఆర్ పేర్లే.. ఒక రైతు కుటుంబంలో పుట్టి, నాటకరంగం ద్వారా వెండితెర వైపు అడుగులేశారు నాగేశ్వరరావు. తెలుగు సినిమాకు నాగేశ్వరావు ఓ మూలస్థంభం. దాదాపు 75 ఏళ్ల పాటు ఆయన సినీ రంగానికి సేవలందించారు. మరో లెజెండ్రీ యాక్టర్ ఎన్టీరామారావు తో కలిసి నాగేశ్వరావు 14 సినిమాల్లో నటించారు.అలాగే తెలుగు సినిమాను చెన్నై నుంచి హైదరాబాద్ కు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.
వ్యక్తిగతంగా నాగేశ్వరావు నాస్తికుడు. అయినా ఎన్నో భక్తి సినిమాలలో అద్భుతంగా నటించారు. ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ 2014 జనవరి 22న తుది శ్వాస విడిచారు. చివరిగా నాగేశ్వరరావు.. కొడుకు అక్కినేని నాగార్జున, మనవడు నాగ చైతన్య తో కలిసి మనం అనే సినిమాలో నటించారు. ఆ సినిమా తర్వాత నాగేశ్వరావు కన్నుమూశారు. నేడు ఆ మహానుభావుడి శతజయంతి సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ లో ఆయన విగ్రవిష్కరణ జరిగింది.
View this post on Instagram
ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. మహేష్ బాబు ఆయన సతీమణి, హీరో నాని, రామ్ చరణ్, జగపతిబాబు, బ్రహ్మానందం, దర్శకుడు వైవీఎస్ చౌదరి, అల్లు అరవింద్, దిల్ రాజు, శ్రీకాంత్ ,మంచు విష్ణు, వెంకయ్య నాయుడు, సుబ్బిరామిరెడ్డి, మోహన్ బాబు ఇలా చాలా మంది సెలబ్రెటీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
View this post on Instagram
నాగార్జున ఇన్ స్టా గ్రామ్ పోస్ట్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.