Naga Chaitanya: ‘సమంత.. ఏదైనా అనుకుంటే కచ్చితంగా చేసి తీరుతుంది’.. నాగచైతన్య ఆసక్తికర కామెంట్స్..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతూ.. తన మాజీ భార్య సమంతపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆమె ఏదైనా అనుకుంటే తప్పకుండా చేసి తీరుతుందని.. ఆమె సంకల్పం గొప్పదని అన్నారు. ఇప్పటివరకు తానూ వర్క్ చేసిన కోస్టార్స్ లో నచ్చిన క్వాలిటీస్ గురించి చెప్పుకొచ్చారు చైతూ.

అక్కినేని నాగచైతన్య… సమంత విడిపోయి దాదాపు రెండేళ్లు కావోస్తుంది. అయినా ఇప్పటికీ వీరిద్దరి సంబంధించిన వార్తలు నిత్యం సోషల్ మీడియాలో వైరలవుతుంటాయి. విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి ఎవరికీ వారు వరుస చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ.. ఎక్కడికి వెళ్లి డివోర్స్ కు సంబంధించిన ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం కస్టడీ ప్రమోషన్లలో పాల్గొంటున్న చైతూకు మరోసారి సమంతకు సంబంధించిన ప్రశ్నలే ఎదురవుతున్నాయి. అయితే తన వ్యక్తిగత జీవితం.. పెళ్లి.. విడాకుల గురించి మరోసారి ఓపెన్ అయ్యారు చైతూ. తమ డివోర్స్ అయిపోయిందని.. ఇంకా ఎందుకు వాటి గురించే చర్చ నడుస్తుందని అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతూ.. తన మాజీ భార్య సమంతపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆమె ఏదైనా అనుకుంటే తప్పకుండా చేసి తీరుతుందని.. ఆమె సంకల్పం గొప్పదని అన్నారు. ఇప్పటివరకు తానూ వర్క్ చేసిన కోస్టార్స్ లో నచ్చిన క్వాలిటీస్ గురించి చెప్పుకొచ్చారు చైతూ.
నాగచైతన్య మాట్లాడుతూ.. “పూజా హెగ్డే స్టైల్ అంటే ఎంతో ఇష్టం.. అలాగే కృతి శెట్టి అమాయకత్వం చూడముచ్చటగా ఉంటుంది. అద్భుతమైన చిత్రాల్లో నటించాలనే తపన తనలో ఉంది. ఇక ప్రతిరోజూ సెట్ కు రాగానే పాత్ర గురించి.. సీన్స్ గురించి ప్రశ్నలు అడుగుతూనే ఉంటుంది.. ఇక సాయిపల్లవి డ్యాన్స్ బాగుంటుంది. ఆమె ఉండడం వల్లే లవ్ స్టోరీ సినిమాలో డాన్స్ కోసం ఎక్కువగా రిహార్సల్స్ చేశాం. శ్రుతిహాసన్ మల్టీ టాలెంటెడ్. ఆమె పాటలు చాలా నచ్చుతాయి. ఇక సమంత హార్డ్ వర్కర్. పరిస్థితులు ఎలా ఉన్నా దృఢ సంకల్పంతో ముందుకు అడుగులు వేస్తుంది. ఏదైనా అనుకుంటే కచ్చితంగా చేసి తీరుతుంది. మజిలీ తర్వాత సామ్ నటించిన ఫ్యామిలీ మ్యాన్, ఓ బేబీ సినిమాలు నాకు చాలా నచ్చాయి. ఇటీవలే ఆమె నటించిన యశోద సినిమాను చూశాను” అంటూ చెప్పుకొచ్చారు.




ఇక తమ డివోర్స్ గురించి స్పందిస్తూ.. ‘మా విడాకులు అయిపోయాయి.. కానీ ఇంకా ఎందుకు ఆ విషయాన్ని సాగదీస్తున్నారో అర్థం కావట్లేదు. మాతో మరొకరిని ముడిపెట్టి గాసిప్స్ రాస్తున్నారు. వాటిని చూసి చాలా ఇబ్బందిపడ్డాను. టీఆర్పీ కోసం నచ్చిన హెడ్డింగ్స్ పెట్టేస్తున్నారు.. నేను సినీ పరిశ్రమలోకి వచ్చింది నటనతో ప్రేక్షకులను అలరిద్దామని.. కాని.. వ్యక్తిగత జీవితంతో ఎంటర్టైన్ చేయడానికి’ కాదు తెలిపారు.




