AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ilaiyaraja: నిజమే నాకు పొగరు ఎక్కువే.. ఇళయరాజా షాకింగ్ కామెంట్స్..

సినీ సంగీత ప్రపంచంలో ఇళయారాజా రారాజు. మూడు దశాబ్దాల సినీ ప్రయాణంలో వివిధ భాషలలో దాదాపు ఐదు వేలకు పైగా పాటలు.. 1000కి పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. 1970 సంగీత దర్శకుడిగా సినీ ప్రయాణం మొదలుపెట్టి.. ఇప్పటికీ తన మ్యూజిక్‏తో శ్రోతలను మంత్రముగ్దులను చేస్తున్నారు.

Ilaiyaraja: నిజమే నాకు పొగరు ఎక్కువే.. ఇళయరాజా షాకింగ్ కామెంట్స్..
Ilaiyaraja
Rajeev Rayala
|

Updated on: Feb 03, 2025 | 3:33 PM

Share

సంగీత దర్శకుడు ఇళయరాజా స్వరపరిచిన పాటలు ఇష్టపడని వారు ఉండరు. ఎన్నో అద్భుతమైన పాటలను అందించారు ఇళయరాజా. ఆయన సంగీతం అంటే ప్రేక్షకులు చెవి కోసుకుంటారు. తెలుగు, తమిళ్ భాషల్లో ఎన్నో వందల సినిమాలకు సంగీతం అందించారు ఎన్నో అద్భుతమైన పాటలను అందించారు ఈ మ్యూజిక్ మ్యాస్ట్రో. కాగా ఇళయరాజా పలు వివాదాల్లోనూ ఇరుక్కున్నారు. గతంలో ఇళయరాజా చేసిన కామెంట్స్ పలు వివాదాలకు దారి తీశాయి. తాజాగా మరోసారి ఇళయరాజా ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా ఇళయరాజా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఈ ఇంటర్వ్యూలో ఇళయరాజా మాట్లాడుతూ.. ‘నేను మ్యూజిక్ అందించిన కొన్ని పాటల ద్వారా వెస్ట్రన్‌ క్లాసికల్‌ సంగీతాన్ని పరిచయం చేశాను. వెస్ట్రన్‌ క్లాసికల్‌ మ్యూజిక్ మీకు నేర్పించింది నేనే. సంగీత దర్శకులు మొజార్ట్‌, పోతోవన్‌ బంటి పేర్లు మీకందరికీ ఎలా తెలుసు ? వారి గురించి చెప్పింది నేనే.. నేనే వారిని మీకు పరిచయం చేశాను. పలు విధాలుగా ప్రపంచ సంగీతాన్ని నా పాటల ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేశాను. నేను సింపోనిని రూపొందించాను. అంటే నాకు సంగీతం అంటే అంత ఆసక్తి అని మీరు తెలుసుకోవాలి. ఇలా అనడం కొందరికి కడుపు మంట కావచ్చు. నా సంగీతం అందరి జీవితాల్లోనూ ఉంటుంది అని చెప్పుకొచ్చారు ఇళయరాజా.

అలాగే నా పాటలు ఎన్నో అద్భుతాలు సృష్టించాయి. నా మ్యూజిక్ విని ఓ చిన్నారి  తిరిగి ప్రాణం పోసుకుంది. అంతే కాదు ఒక ఏనుగుల గుంపు సైతం నా సంగీతాన్ని ఆస్వాదించేవి. ఆ ఏనుగుల గుంపు నా పాటలు వినడానికి వచ్చాయి. ఇవన్నీ చెబితే నాకు గర్వం, పొగరు అంటారు. అయినా నాకు అర్ధం కానీ విషయం ఏంటంటే.. గర్వం నాకు కాకపోతే వేరే వారికి ఎందుకు ఉంటుంది.? నిజమే నాకు పొగరు ఎక్కువే. ప్రపంచంలోనే ఎవరు చేయలేని దానిని నేను చేశాను. అలాంటప్పుడు నాకేగా పొగరు ఉండాలి. నాకే కదా గర్వం ఉండాలి. ప్రతిభ ఉన్నవారికే గర్వం ఉంటుంది అని ఇళయరాజా చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ కామెంట్స్ పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి