Salaar : సలార్ సినిమా పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్.. ఏమన్నారంటే
సలార్ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ నుంచి ఓ సలిడ్ హిట్ కోరుకుంటున్న అభిమానుల కల ఈ సినిమాతో నెరవేరనుంది తెలుస్తోంది. దాంతో సలార్ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సలార్ సినిమా ఉగ్రం సినిమాకు రీమేక్ అంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.

ఇప్పుడు ఎక్కడ చూసిన సాలార్ మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు. మోస్ట్ ఏవైటెడ్ మూవీ అయిన సలార్ సినిమానుంచి రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. సలార్ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ నుంచి ఓ సలిడ్ హిట్ కోరుకుంటున్న అభిమానుల కల ఈ సినిమాతో నెరవేరనుంది తెలుస్తోంది. దాంతో సలార్ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సలార్ సినిమా ఉగ్రం సినిమాకు రీమేక్ అంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. శ్రీమురళి, తిలక్ శేఖర్, హరిప్రియ తదితరులు నటించిన ‘ఉగ్రం’ చిత్రం 2014లో విడుదలైంది. ఈ సినిమా థియేటర్‌లో పెద్దగా సందడి చేయలేదు. ఆ తర్వాత యూట్యూబ్‌లో సినిమా విడుదలైంది. అప్పట్లో జనాలు సినిమాలను ఇష్టపడ్డారు. ఈ చిత్రం భారీ ప్రశంసలు అందుకుంది.
ఆ తర్వాత ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్ 2’ సినిమాలు చేశాడు. ఈ సినిమాలు చరిత్ర సృష్టించాయి. ఇప్పుడు ఆయన దర్శకత్వం వహించిన ‘సలార్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ సందడి చేస్తోంది. అలాగే ఈ సినిమాలో ‘ఉగ్రం’ షేడ్ ఎక్కువగాకనిపిస్తున్నాయి. అగస్త్య అనే వ్యక్తి తన స్నేహితుడైన బాల కోసం జీవితాన్ని గడిపేస్తాడు. ఆ తరువాత ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. అగస్త్య విలన్ గా మారిపోతాడు అతడ్ని బాల ఎదుర్కొంటాడు ఇది ఉగ్రం స్టోరీ.
‘కేజీఎఫ్ 2’ విడుదలకు ముందే ‘సలార్’ సెట్ అయింది. ఇది ‘ఉగ్రం’ చిత్రానికి రీమేక్ అని అప్పట్లోనే ప్రచారం జరిగింది. అయితే, టీమ్ మాత్రం దీనిని ఖండిస్తూనే ఉంది. కానీ, రవి బస్రూర్ మాత్రమే అసలు విషయాన్ని బయటపెట్టాడు.‘ఉగ్రం’ చిత్రానికి రవి బస్రూరు సంగీతం అందించారు. రవి బస్రూర్ ‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్ 2’ చిత్రాలకు ప్రశాంత్ నీల్‌తో కలిసి సంగీత దర్శకుడిగా పనిచేశాడు. ‘సలార్’ చిత్రానికి కూడా సంగీతాన్ని అందించారు.
‘సలార్’ సెట్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన రవి బస్రూరుకు ఓ ప్రశ్న ఎదురైంది. ‘ఇది ఉగ్రమ్‌కి రీమేక్‌నా.?’ అని ప్రశ్నించారు. దీనికి రవి బస్రూర్ సూటిగా సమాధానం ఇచ్చారు. ‘అది అందరికీ తెలిసిన విషయమే. కానీ, రీమేక్ చేసినా ఎలా చేస్తారో మీకు తెలుసు’ అని రవి బస్రూర్ అన్నారు. ట్రైలర్ చూసిన చాలా మంది ఈ మాటను గుర్తు చేసుకుంటున్నారు. వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో ‘సలార్’ రెడీ అయ్యింది.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సలార్’. ‘హోంబాలే ఫిల్మ్స్’ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నిర్మాత విజయ్ కిర్గందూర్ ఏ విషయంలోనూ రాజీపడలేదు. ప్రభాస్, పృథ్వీరాజ్ స్నేహితులుగా కనిపించనున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. డిసెంబర్ 22న తెలుగు, కన్నడ, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
𝐏𝐥𝐞𝐚𝐬𝐞…𝐈…𝐊𝐢𝐧𝐝𝐥𝐲…𝐑𝐞𝐪𝐮𝐞𝐬𝐭!
Unleashing #SalaarTrailer: https://t.co/QiP7mGuixL#Salaar #SalaarCeaseFire #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms @IamJagguBhai @sriyareddy @bhuvangowda84 @RaviBasrur @shivakumarart… pic.twitter.com/iDFxzgGcGT
— Salaar (@SalaarTheSaga) December 1, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



