AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Animal Movie : అమ్మబాబోయ్ రష్మిక రెచ్చిపోయిందిగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యానిమల్ బోల్డ్ సీన్స్..

తాజాగా సందీప్ రెడ్డి యానిమల్ సినిమాలోనూ బోల్డ్ సన్నివేశాలు చూపించారు. రష్మిక మందన్న ఈ సినిమాలో స్ట్రాంగ్ బోల్డ్‌గా నటించింది. మునుపెన్నడూ నటించనంత బోల్డ్ గా రష్మిక ఈ సినిమాలో కనిపించింది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై అభిమానులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

Animal Movie : అమ్మబాబోయ్ రష్మిక రెచ్చిపోయిందిగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యానిమల్ బోల్డ్ సీన్స్..
Animal
Rajeev Rayala
|

Updated on: Dec 02, 2023 | 6:00 PM

Share

దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సినిమాలో బోల్డ్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విషయం పై ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఆడియన్స్ లో ఓ క్లారిటీ వచ్చేసింది. ఈ మధ్యకాలంలో బోల్డ్ సన్నివేశాలు సినిమాల్లో చాలా కామన్ అవుతున్నాయి. తాజాగా సందీప్ రెడ్డి యానిమల్ సినిమాలోనూ బోల్డ్ సన్నివేశాలు చూపించారు. రష్మిక మందన్న ఈ సినిమాలో స్ట్రాంగ్ బోల్డ్‌గా నటించింది. మునుపెన్నడూ నటించనంత బోల్డ్ గా రష్మిక ఈ సినిమాలో కనిపించింది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై అభిమానులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కొంతమందిని నెటిజన్స్ ట్రోల్ చేసే పనిలో పడ్డారు.

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా రాణిస్తుంది. తెలుగులో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పటివరకు రష్మిక మందన్న చేసిన పాత్రలు సాదాసీదాగా ఉంటాయి. తెలుగులోకి వెళ్లిన తర్వాత బోల్డ్ పాత్రలు చేయడం మొదలుపెట్టాడు. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాల్లో లిప్ లాక్ సీన్స్ ఉన్నాయి. ‘యానిమల్’ సినిమాలో చాలా హాట్ అవతార్‌లో నటించింది. ఇందుకు సంబంధించినవీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ మధ్య కాలంలో పైరసీ విపరీతంగా పెరిగిపోయింది. చాలా సినిమాలు రిలీజ్ రోజు సోషల్ మీడియాలో లీక్ అవుతుంటాయి. అలాగే థియేటర్‌కి వెళ్లిన పలువురు అభిమానులు ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో సినిమా కలెక్షన్లకు కూడా గండి పడుతుంది. ఇక ‘యానిమల్‌’ చిత్రంలో రణ్‌బీర్‌ కపూర్‌ భార్యగా రష్మిక నటించింది. ఈ సినిమాలో చాలా బోల్డ్‌గా కనిపించింది. కొన్ని రొమాంటిక్ సీన్స్ లో రష్మిక రెచ్చిపోయి నటించింది. ఈ సీన్ చూసి పలువురు రష్మిక మందన్నను ట్రోల్ చేస్తున్నారు.  ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం రష్మిక భారీ రెమ్యునరేషన్ అందుకుందని తెలుస్తోంది. యానిమల్ సినిమాకోసం రష్మిక దాదాపు 7 కోట్లవరకు వసూల్ చేసిందని టాక్ వినిపిస్తుంది. ‘యానిమల్’ చిత్రం హిందీలో తొలిరోజు 54 కోట్ల రూపాయలను రాబట్టింది. దీంతో సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. రానున్న రోజుల్లో యానిమల్ భారీ వసూళ్లను రాబడుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో ఈ సినిమా ఈజీగా రూ.300 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని బాక్సాఫీస్ పండితులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..