AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manjummel Boys vs Ilayaraja : మంజుమ్మల్ బాయ్స్ మూవీ టీంకు ఇళయరాజా నోటీసులు.. ఎందుకంటే..

అక్కడే తమ స్నేహితుడు ఆ గుహలలో పడిపోవడంతో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి తమ స్నేహితుడిని రక్షించుకున్నారు. ఈ ఘటనను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందించారు. సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా ఇప్పుడు చిక్కుల్లో పడింది. మంజుమ్మల్ బాయ్స్ చిత్రబృందానికి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయారాజా లీగల్ నోటీసులు పంపించారు.

Manjummel Boys vs Ilayaraja : మంజుమ్మల్ బాయ్స్ మూవీ టీంకు ఇళయరాజా నోటీసులు.. ఎందుకంటే..
Manjummal Boys, Ilayaraja
Rajitha Chanti
|

Updated on: May 23, 2024 | 8:59 AM

Share

ఇటీవల బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సినిమా మంజుమ్మల్ బాయ్స్. రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ మలయాళంలో భారీ వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా దాదాపు రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కేరళ నుంచి తమిళనాడులోని కొడైకెనాల్‏ను సందర్శించిన కొందరు స్నేహితులు గుణ గుహలను చూసేందుకు వెళ్తారు. అక్కడే తమ స్నేహితుడు ఆ గుహలలో పడిపోవడంతో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి తమ స్నేహితుడిని రక్షించుకున్నారు. ఈ ఘటనను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందించారు. సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా ఇప్పుడు చిక్కుల్లో పడింది. మంజుమ్మల్ బాయ్స్ చిత్రబృందానికి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయారాజా లీగల్ నోటీసులు పంపించారు.

ఈ సినిమా క్లైమాక్స్‏లో 1991లో కమల్ హాసన్ నటించిన గుణ చిత్రంలోని కన్మణి అన్బోడు పాటను ఉపయోగించారు. అప్పట్లో గుణ చిత్రానికి ఇళయరాజా మ్యూజిక్ డైరెక్టర్. ఈ సాంగ్ ఇప్పుడు తెగ ఫేమస్ అయ్యింది. అటు సోషల్ మీడియలో ఈ సాంగ్ ట్రెండ్ అవుతుంది. అయితే తమ అనుమతి లేకుండా ఈ పాటను వాడుకున్నందుకు చిత్రనిర్మాణ సంస్థకు ఇళయారాజా తరపు లాయర్ శరవణన్ నోటీసులు పంపించారు.

కాపీరైట్ చట్టం ప్రకారం ఈ పాటకు సంబంధించిన పూర్తి హక్కులు ఇళయరాజాకు చెందనవి. అలాంటప్పుడు తమ సినిమాలో ఈ పాటను ఉపయోగించాలంటే హక్కులు పొందాలంటే వినియోగానికి తగిన పరిహారం చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. లేదంటే కాపీరైట్ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లుగా చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటీవల రజినీకాంత్ నటిస్తున్న కూలి సినిమా టీజర్ లో తన సంగీతాన్ని అనుమతి లేకుండా వాడినట్లు సన్ పిక్చర్స్ సంస్థకు ఇళయరాజా నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. మంజుమ్మల్ బాయ్స్ సినిమా ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.