- Telugu News Photo Gallery Cinema photos Discussion about Ranveer Singh and Saif Ali Khan in internet
Bollywood Heroes: అసలేం జరుగుతోంది… బాలీవుడ్‌లో ఇప్పుడు.. నెటిజన్లు గుసగుసలు..
ఏం జరుగుతోంది.. అసలేం జరుగుతోంది... బాలీవుడ్‌లో ఇప్పుడు... అంటూ కాస్త సీరియస్‌గానే మాట్లాడుకుంటున్నారు నెటిజన్లు. బాలీవుడ్ హీరోలు చేస్తున్న కొన్ని పనులను చూస్తుంటే... వాళ్లు జనాలకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పబోయే విషయానికి ముందే హింట్స్ ఇస్తున్నారా? అనే మాటలూ వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా రీసెంట్‌గా రణ్‌వీర్ అండ్ సైఫ్ ఈ విషయంలో గట్టిగానే ట్రెండ్ అవుతున్నారు.
Updated on: May 23, 2024 | 9:22 AM

రణ్‌వీర్ సింగ్, దీపిక పదుకోన్ జంటకు బాలీవుడ్‌లో చాలా మంచి క్రేజ్ ఉంది. వాళ్లిద్దరూ బెస్ట్ కపుల్‌గా పోట్రే అవుతుంటారు. ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ, ఒకరికొకరు స్వేచ్ఛనిస్తూ గడుపుతున్నారంటూ చాలా మంది ప్రశంసిస్తుంటారు. త్వరలోనే దీపిక తల్లి కాబోతున్నారు. ఇలాంటి సమయంలో రణ్‌వీర్ చేసిన ఓ పని చర్చకు దారి తీసింది.

తన సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి పెళ్లి ఫొటోలను డిలీట్ చేశారు రణ్‌వీర్ సింగ్. వెంటనే అందరూ దీపిక అకౌంట్స్ చెక్ చేస్తే, అక్కడ ఎలాంటి మార్పూ కనిపించలేదు. త్వరలోనే తండ్రి కాబోతున్న ఈ సమయంలో పెళ్లి ఫొటోలను పనిగట్టుకుని డిలీట్ చేయాల్సిన అవసరం, రణ్‌వీర్‌కి ఏం వచ్చింది? అంటూ నోళ్లు నొక్కుకున్నారు జనాలు.రణ్‌వీర్ - దీపిక విడిపోయే ఆలోచనలో ఉన్నారా? అనే అనుమానాలూ వినిపించాయి. ఇప్పుడు ఆ మాటలు కాస్త సర్దుమణిగాయి.

ఇంతలోనే సైఫ్ అలీఖాన్ చేసిన ఓ పని ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. సైఫ్ ఎడమ చేతి మీద కరీనా పేరును పచ్చబొట్టు వేయించుకున్నారు. అయితే ఇప్పుడు ఆ పేరు స్థానంలో త్రిశూలం ఆకారం కొత్తగా కనిపిస్తోంది.

సైఫ్ - కరీనా మధ్య అంతా సవ్యంగానే సాగుతోందా? వాళ్లిద్దరూ డైవర్స్ దిశగా అడుగులు వేయడం లేదు కదా అని కంగారుపడుతున్నారు ఫ్యాన్స్. బాలీవుడ్‌లో పరస్పరం సపోర్ట్ చేసుకుంటూ క్లిక్ అవుతున్న జంటగా పేరుంది వీరిద్దరికి.

దాంతో ఫ్యాన్స్ లో ఆందోళన కనిపించింది. సైఫ్ కొత్త సినిమాల కోసం అలా చేశారేమోనని మరికొందరు సర్దిచెప్పుకుంటున్నారు. అటు రణ్‌వీర్‌గానీ, ఇటు సైఫ్‌గానీ మనసులో ఉన్న మాటలను బయటకు చెప్పనంత వరకు రకరకాల వదంతులు వినిపిస్తూనే ఉంటాయి మరి.




