Maa Elections 2021: ప్రకాశ్‌ రాజ్‌ ‘మా’ రాజీనామాపై స్పందించిన విష్ణు.. ఈ విషయంపై మాట్లాడుదామంటూ..

Narender Vaitla

Narender Vaitla |

Updated on: Oct 11, 2021 | 3:47 PM

Maa Elections 2021: ఎంతో ఉత్కంఠ నడుమ సాగిన మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్ష ఎన్నికలు ఎట్టకేలకు ముగిసిన విషయం తెలిసిందే. ఆరోపణలు, ప్రత్యారోపణల నడుమ సాగిన రచ్చ ఆదివారంతో ముగిసింది...

Maa Elections 2021: ప్రకాశ్‌ రాజ్‌ 'మా' రాజీనామాపై స్పందించిన విష్ణు.. ఈ విషయంపై మాట్లాడుదామంటూ..
Manchu Vishnu, Prakash Raj

Follow us on

Maa Elections 2021: ఎంతో ఉత్కంఠ నడుమ సాగిన మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్ష ఎన్నికలు ఎట్టకేలకు ముగిసిన విషయం తెలిసిందే. ఆరోపణలు, ప్రత్యారోపణల నడుమ సాగిన రచ్చ ఆదివారంతో ముగిసింది. హోరా హోరీగా సాగిన ఎన్నికల పోరులో చివరికి మంచు విష్ణు ప్యానెల్‌ గెలుపొందింది. ఇక మా అధ్యక్ష పదవి పీఠాన్ని మంచు విష్ణు అధిరోహించిన విషయం తెలిసిందే. దీంతో విష్ణు అనుచరులు పండగ చేసుకున్నారు. ఈ విజయం మోహన్‌ బాబు మాట్లాడుతూ ఇది ఏ ఒక్కరి విజయం కాదని, మా సభ్యుల విజయం అంటూ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే మొదటి నుంచి ప్రకాశ్‌ రాజ్‌కు మద్దతుగా నిలిచిన నాగబాబు ఎన్నికల ఫలితాలు వెల్లడైన కాసేపటికే మా సభ్యత్వానికి రాజీనామా చేసిన అందరినీ షాక్‌కి గురి చేసిన విషయం తెలిసిందే.

ఇక అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన ప్రకాశ్‌ రాజ్‌ సోమవారం ఉదయం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి.. ఇక్కడ ప్రాంతీయ వాదానికి ప్రాధాన్యత ఇస్తున్నారాన్ని. ఇలాంటి అసోసియేషన్‌లో తాను ఉండలేనంటూ మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే తెలుగు సినిమాల్లో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తానని, తెలుగు సినిమా ఇండస్ట్రీలో అతిథిగానే మెదులుకుంటానని తేల్చి చెప్పాడు. అయితే ప్రకాశ్‌ రాజ్‌ రాజీనామా అంశంపై విష్ణు స్పందించారు. ఈ విషయమై ప్రకాశ్‌రాజ్‌కు మెసేజ్‌ పంపించారు. విష్ణు, ప్రకాశ్‌ రాజ్‌లకు మధ్య ఫోన్‌లో జరిగిన చాట్‌ను స్క్రీన్‌ షాట్‌ తీసి ట్వీట్‌ చేస్తూ.. భవిష్యత్తులో మనం ఎప్పటికీ ఒక్కటే అని పేర్కొన్నారు.

ఇక విష్ణు మెసేజ్‌లో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రకాశ్‌ రాజీనామాపై అసహనాన్ని వ్యక్తం చేసిన విష్ణు.. ‘మీరు తీసుకున్న నిర్ణయం నాకు నచ్చలేదు. మీరు నాకన్న చాలా పెద్ద వారు. గెలుపు ఓటములు అనేవి నాణేనికి రెండు వైపుల్లాంటివని మీకు తెలుసు. ఎమోషనల్‌ అవ్వొద్దని కోరుకుంటున్నాను. మీరు మా కుటుంబంలో ఒక సభ్యులు. మీ సలహాలు మాకు చాలా అవసరం. మనం కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి ఇప్పుడే రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు. తొందరలోనే నేను మిమ్మల్ని నేరుగా కలిసి మాట్లాడుతాను. ఐ లవ్‌ యూ అంకుల్‌. దయచేసి తొందరపడకండి’ అంటూ చెప్పుకొచ్చారు.

Also Read: Bigg Boss 5 Telugu: దొంగాట వద్దంటూ యానీ మాస్టర్ ఫైర్.. బుద్ది వచ్చిందంటూ జెస్సీ రియలైజ్.. నామినేషన్స్‏లో పింకీ ఆగ్రహం..

6G Technology: ఇంకా 5G టెక్నాలజీని రానేలేదు.. 6G టెక్నాలజీపై కసరత్తు ప్రారంభించిన కేంద్ర సర్కార్‌..!

Jammu Kashmir: జమ్మూ కశ్మీర్‌లో మళ్లీ తుపాకుల మోత.. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu