Bigg Boss 5 Telugu: దొంగాట వద్దంటూ యానీ మాస్టర్ ఫైర్.. బుద్ది వచ్చిందంటూ జెస్సీ రియలైజ్.. నామినేషన్స్‏లో పింకీ ఆగ్రహం..

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్‏కు అసలైన పరీక్ష నామినేషన్స్ డే. వారం మొత్తం సరదాగా గడిచిన నామినేషన్స్ రోజున ఒక్కొక్కరి నిజాలు బయటపడిపోతాయి.

Bigg Boss 5 Telugu: దొంగాట వద్దంటూ యానీ మాస్టర్ ఫైర్.. బుద్ది వచ్చిందంటూ జెస్సీ రియలైజ్.. నామినేషన్స్‏లో పింకీ ఆగ్రహం..
Bigg Boss Promo
Follow us
Rajitha Chanti

| Edited By: Ravi Kiran

Updated on: Oct 11, 2021 | 7:28 PM

Bigg Boss Telugu 5: బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్‏కు అసలైన పరీక్ష నామినేషన్స్ డే. వారం మొత్తం సరదాగా గడిచిన నామినేషన్స్ రోజున ఒక్కొక్కరి నిజాలు బయటపడిపోతాయి. ఇక నామినేట్ చేసిన మొదలైన గొడవలు వారం మొత్తం కంటిన్యూ చేస్తుంటారు. ఇప్పటికీ ఐదు వారాలు పూర్తిచేసుకుని ఆరో వారంలోకి ఎంటర్ అయ్యింది బిగ్ బాస్ షో. ఇంటినుంచి ఇప్పటివరకు ఐదుగురు సభ్యులు ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారం నుంచి ఇప్పటివరకు సరయూ, ఉమాదేవి, లహరి, నటరాజ్ మాస్టర్, హమీదా ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఆరోవారం నామినేషన్ ప్రక్రియ వచ్చేసింది. ఇందుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు మేకర్స్.

తాజా ప్రోమోను చూస్తే.. ఈవారం నామినేషన్స్ ప్రక్రియ హీట్ హీట్‏గా సాగినట్టుగా తెలుస్తోంది. ఇక జెస్సీకి సన్నీ అసలు ట్విస్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. టాస్కులో తనకు సపోర్ట్ ఇచ్చిన జెస్సీని ఈవారం నామినేట్ చేశాడు సన్నీ. దీంతో నాకు బాగా అర్థమైందని.. ఇప్పుడు బుద్దొచ్చిందని చెప్పుకొచ్చాడు జెస్సీ.. ఇక అనంతరం యానీ మాస్టర్ విశ్వ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. దొంగాట వద్దని.. అంటుండగా.. అక్క , అక్క అంటూ విశ్వ పిలుస్తుండగా.. అక్క తొక్క చెప్పి ఇలాంటి రిలేషన్ కాకుండా.. ఫేస్ టూ ఫేస్ అంటూ ఫైర్ అయ్యింది యానీ మాస్టర్. ఇక ఆ తర్వాత.. సిరి.. శ్వేతను నామినేట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత ప్రియా.. విశ్వను నామినేట్ చేసింది. అలాగే సిరి.. జెస్తీ, షణ్ముఖ్ తో జరిగిన గొడవను మళ్లీ తీసుకువస్తూ.. శ్రీరామచంద్రను నామినేట్ చేసింది. ఇక ఆ తర్వాత టాస్కులో తన పట్ల మానస్ ప్రవర్తించిన తీరుతో తన గుండె పగిలిపోయిందని రవి.. మానస్‏ను నామినేట్ చేశాడు. ఇక ఆతర్వాత సన్నీ, జెస్సీ మధ్య హీట్ డిస్కషన్ జరిగింది. నన్ను బెదిరిస్తున్నావా అంటూ జెస్సీ ప్రశ్నించాడు. ఇక చివరకు వచ్చిన ప్రియాంక.. లోబో పై కోపంతో ఊగిపోయింది. సిగ్గుండాలి అంటూ లోబో ఫోటోను ఇష్టానుసారంగా చింపి మంటల్లో పడేసింది. మొత్తానికి ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ మరింత రసవత్తరంగా మారినట్టుగా తెలుస్తోంది.

బిగ్ బాస్ ప్రోమో..

Also Read: Samantha: సమంతపై వస్తోన్న రూమర్స్‌పై నాగ చైతన్య స్పందించాలి: సామ్ స్టైలిస్ట్ ప్రీతమ్

Samantha: సమంతపై ఆగని రూమర్స్.. ఆవేదన వ్యక్తం చేసిన హీరోయిన్.. బాసటగా నిలిచిన రకుల్ ప్రీత్ సింగ్..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో