AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: సమంతపై ఆగని రూమర్స్.. ఆవేదన వ్యక్తం చేసిన హీరోయిన్.. బాసటగా నిలిచిన రకుల్ ప్రీత్ సింగ్..

గత కొద్ది రోజులుగా ఎక్కడా చూసిన సమంత పేరు.. ఆమెకు సంబంధించిన వార్తలే. నిజానికి విడిపోయింది ఇద్దరూ.. కానీ సోషల్ మీడియాలో మాత్రం

Samantha: సమంతపై ఆగని రూమర్స్.. ఆవేదన వ్యక్తం చేసిన హీరోయిన్.. బాసటగా నిలిచిన రకుల్ ప్రీత్ సింగ్..
Samantha
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 11, 2021 | 1:01 PM

గత కొద్ది రోజులుగా ఎక్కడా చూసిన సమంత పేరు.. ఆమెకు సంబంధించిన వార్తలే. నిజానికి విడిపోయింది ఇద్దరూ.. కానీ సోషల్ మీడియాలో మాత్రం సమంతకు సంబంధించిన వార్తలే ఎక్కువగా వస్తున్నాయి. నాగచైతన్యతో విడాకులు తీసుకోవడానికి ప్రధాన కారణం సమంత వ్యవహర శైలి అంటూ రూమర్స్ తెగ చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా.. ఆమెకు సంబంధించిన పలు రకాల రూమర్స్ వ్యాప్తిస్తుండడంతో.. నెటిజన్స్ సైతం సమంత గురించి.. ఆమె వైవాహిక జీవితంలో అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇక సమంత, నాగచైతన్య విడాకుల అనంతరం.. హీరో సిద్ధార్థ్ చేసిన ట్విట్ సైతం హాట్ టాపిక్‏గా మారిన సంగతి తెలిసిందే. ఒక్క ట్వీట్‏తో విడాకుల వ్యవహరం పూర్తిగా సమంత వైపుకు మళ్లింది. విడిపోవడానికి కారణం.. సమంతనే అంటూ సోషల్ మీడియాలో వరుస కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో తనపై వస్తున్న అసత్య ప్రచారంపై సమంత తన ఇన్‏స్టా వేదికగా స్పందించింది. నెట్టింట్లో తన గురించి వస్తున్న రూమర్స్ పై సమంత తన సోషల్ మీడియా ఖాతాలో భావోద్వేగ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ మేరకు తన ఇన్ స్టా ఖాతాలో సామ్.. నా వ్యక్తిగత సమస్య మీద మీరందరూ చూపిస్తున్న ఎమోషన్స్ కు థ్యాంక్స్. అలాగే.. నా మీద వచ్చిన రూమర్స్ నుంచి నన్ను కాపాడిన వారికి కృతజ్ఞతలు. నాకు ఎఫైర్స్ ఉన్నాయని.. పిల్లలను కనకూడదనుకున్నానని.. నేను అవకాశవాదినని.. అబార్షన్లు అయ్యాయని రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. నా వ్యక్తిత్వంపై జరుగుతున్న ఈ దాడి చాలా దారుణమైనది. కనికరం లేనిది. కానీ.. మీరనుకునే విధంగా నేనెప్పుడూ చేయను. ఇది నా ప్రామిస్.. ఈ కష్టపరిస్థితులలో నుంచి కుంగబాటు నుంచి కోలుకునేందుకు కొంత సమయం ఇవ్వండి అంటూ ఆవేదనతో కూడిన లెటర్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది సామ్.

Rakul

Rakul

ఇదిలా ఉంటే.. ఇప్పుడు సమంతకు సినీ ప్రముఖులు ఒక్కొక్కరిగా బాసటగా నిలుస్తున్నారు. సోషల్ మీడియా ఖాతాల ద్వార సమంత పై వస్తున్న తప్పుడు వార్తలను నియంత్రించడమే కాకుండా.. అసలు విషయం అది కాదని.. సమంత పిల్లలను కావాలనుకుందని చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే ప్రొడ్యూసర్ నీలిమా.. సమంతకు బాసటగా నిలిచిన సంగతి తెలిసిందే. సామ్ గురించి.. ఆమె వ్యక్తిత్వం గురించి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా సమంతకు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మద్దతు తెలిపింది. సామ్ చేసిన భావోద్వేగ పోస్ట్‏కు రిప్లై ఇస్తూ తన మద్దతు తెలియజేసింది రకుల్. ఇక సమంతతో విడాకుల ప్రకటన అనంతరం నాగచైతన్య సైలెంట్ అయ్యాడు. ఇప్పటివరకు ఈ విషయాలపై స్పందించలేదు.

Also Read: Sunitha Boya: మరోసారి తెరపైకి సునీత బోయ.. తనకు మంచు విష్ణు న్యాయం చేయాలని డిమాండ్..

Prakash Raj: నేను తెలుగువాడిని కాదు.. అది నా తప్పా.. ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్..