6G Technology: ఇంకా 5G టెక్నాలజీని రానేలేదు.. 6G టెక్నాలజీపై కసరత్తు ప్రారంభించిన కేంద్ర సర్కార్‌..!

6G Technology:  ప్రస్తుతం 5టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. టెలికాం కంపెనీలు. 5జీ టెక్నాలజీ అందుబాటులోకి..

6G Technology: ఇంకా 5G టెక్నాలజీని రానేలేదు.. 6G టెక్నాలజీపై కసరత్తు ప్రారంభించిన కేంద్ర సర్కార్‌..!
Follow us

|

Updated on: Oct 11, 2021 | 1:31 PM

6G Technology:  ప్రస్తుతం 5టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. టెలికాం కంపెనీలు. 5జీ టెక్నాలజీ అందుబాటులోకి రాకముందే 6జీ టెక్నాలజీ మీద పనులు ప్రారంభించాలని కేంద్రం పేర్కొంది. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం పరిశోధన, అభివృద్ధి సంస్థ సీ-డీఓటీని ప్రపంచ మార్కెట్‌కు అనుగుణంగా 6జీ టెక్నాలజీ మీద పనులను ప్రారంభించాలని టెలికాం కార్యదర్శి కె రాజరామన్ కోరారు. ఇప్పటికే ఎల్‌జీ, శామ్ సంగ్, హువావే, ఇతర మరికొన్ని కంపెనీలు 6జీ టెక్నాలజీలపై పనిచేయడం ప్రారంభించాయి.

5జీ కంటే 50 రెట్లు వేగంగా..

కాగా, టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్న నేపథ్యంలో ఈ టెక్నాలజీ 5జీ కంటే 50 రెట్లు వేగంగా ఉంటుందని, 2028-2030 మధ్య వాణిజ్యపరంగా అందుబాటులోకి రానున్నట్లు భావిస్తున్నారు. వొడాఫోన్ ఐడియా భారతదేశంలో ట్రయల్స్ సమయంలో అత్యధిక గరిష్ట వేగం 3.7 జీబీపీలను సాధించినట్లు వెల్లడించింది. అయితే దేశంలోని రిలయన్స్ జియో నెట్ వర్క్ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) సెకనుకు 20 మెగాబిట్ వద్ద 4జీ టాప్ వేగాన్ని నమోదు చేసింది.

కాగా, అక్టోబర్‌ 1వ తేదీన డీఓటీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన రాజరామన్‌ టెక్నాలజీ వాణిజ్యీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని అక్టోబర్ 1న డీఓటీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన రాజరామన్ టెక్నాలజీపై దృష్టి పెట్టాలని, వేగవంతమైన సాంకేతిక పరిజ్ఞానం కోసం సి-డీఒటిలో ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేయడాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సీ-డీఓటీకి సూచించారు. ఇప్పటికే అమెరికా, చైనా వంటి దేశాలు 6జీ టెక్నాలజీ అభివృద్ధి, పరిశోధనలకు సంబంధించిన పనులు మొదలు పెట్టాయి. ఇప్పుడు ఆ దేశాలతో పోటీగా మన దేశంలో కూడా ఈ కొత్త టెక్నాలజీపై పని చేయాలని తెలిపింది.

ఇవీ కూడా చదవండి:

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో రూ.53వేల ఐఫోన్‌ ఆర్డర్‌ చేస్తే.. ఫోన్‌కు బదులు రెండు నిర్మ సబ్బులు.. వీడియో వైరల్‌

Whatsapp: మీరు వాట్సాప్‌ వాడుతున్నారా..? అయితే ఇలా చేశారంటే మీ అకౌంట్‌ బ్లాకే..!