Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Payments: నెట్ అవసరం లేదు..యాప్‌‌తో పనిలేదు..స్మార్ట్ ఫోన్ అక్కరలేదు..మీ బ్యాంక్ ఎకౌంట్ నుంచి డబ్బు పంపించేయండిలా..

మనం ఇప్పుడు డబ్బులు చేతిలో పట్టుకుని బజారుకు వెళ్ళడం చాలావరకూ తగ్గిపోయింది. యూపీఐ పేమెంట్ విధానంలో చాలా సింపుల్ గా మనం ఇప్పుడు డబ్బును ఎవరికైనా పంపించలన్నా.. ఏదైనా వస్తువును కొనాలన్నా సులభంగా కానిచ్చేస్తున్నాము.

Payments: నెట్ అవసరం లేదు..యాప్‌‌తో పనిలేదు..స్మార్ట్ ఫోన్ అక్కరలేదు..మీ బ్యాంక్ ఎకౌంట్ నుంచి డబ్బు పంపించేయండిలా..
Upi Payments Without Internet
Follow us
KVD Varma

|

Updated on: Oct 11, 2021 | 7:18 PM

Payments without internet: మనం ఇప్పుడు డబ్బులు చేతిలో పట్టుకుని బజారుకు వెళ్ళడం చాలావరకూ తగ్గిపోయింది. యూపీఐ పేమెంట్ విధానంలో చాలా సింపుల్ గా మనం ఇప్పుడు డబ్బును ఎవరికైనా పంపించలన్నా.. ఏదైనా వస్తువును కొనాలన్నా సులభంగా కానిచ్చేస్తున్నాము. అయితే, ఇప్పటివరకూ మనకు యూపీ ఐ ట్రాన్సాక్షన్ చేయాలంటే ఇంటర్నెట్ ఉండాలని తెలుసు. అదీ కాకుండా స్మార్ట్ ఫోన్ లో యూపీఐ యాప్ (పేటీఎం లేదా జీ పే వంటివి)కూడా ఉండాల్సిందే. కానీ..ఇవేవీ అవసరం లేకుండానే.. అంటే స్మార్ట్ ఫోన్.. ఇంటర్నెట్.. యూపీఐ యాప్ కూడా లేకుండా మన బ్యాంక్ ఎకౌంట్ నుంచి డబ్బు పంపించవచ్చు. అదేవిధంగా ఏదైనా వస్తువునూ కొనుగోలు చేసేయవచ్చు. దీనికోసం ఏ రకమైన కోడ్ స్కాన్ కూడా చేయనవసరం లేదు. మీ దగ్గర సాధారణ ఫోన్ ఉన్నా కూడా మీరు ఫోన్ ద్వారా పేమెంట్స్ చేసేయగలుగుతారు. ఇంటర్నెట్ లేకుండా చెల్లింపు ప్రక్రియ గురించి ఈ రోజు మీకోసం ఇక్కడ వివరంగా చెబుతున్నాం..

1. ఇంటర్నెట్ లేకుండా UPI చెల్లింపు చేయడానికి, ముందుగా మీరు మీ ఫోన్ డయలర్ వద్దకు వెళ్లి *99# అని టైప్ చేసి కాల్ బటన్ నొక్కండి.

2. ఇప్పుడు మీ స్క్రీన్‌పై సెండ్ మనీ, రిసీవ్ మనీ, చెక్ బ్యాలెన్స్, మై ప్రొఫైల్, పెండింగ్ అభ్యర్థనలు, లావాదేవీలు మరియు యూపీఐ (UPI) పిన్ వంటి ఆప్షన్‌లతో పాప్ అప్ మెనూ కనిపిస్తుంది. మీరు మీ అవసరానికి అనుగుణంగా ఏదైనా ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. దానికి సంబంధించిన నంబర్‌ను నమోదు చేసి పంపవచ్చు.

Upi Payment

3. మీరు యూపీఐ ద్వారా ఎవరికైనా డబ్బు పంపాలనుకుంటే, Send Money తో ఆప్షన్‌ని ఎంచుకోండి. ఇప్పుడు ఒక కొత్త పాప్ -అప్ మెను మీ ముందు కనిపిస్తుంది, దీనిలో మొబైల్ నంబర్, UPI ID.. IFSC ఖాతా నంబర్ వంటి ఏ మాధ్యమం ద్వారా మీరు డబ్బు పంపాలనుకుంటున్నారో వరుసగా ఆప్షన్స్ కనిపిస్తాయి.

Payment Without App

4. మీరు మొబైల్ నంబర్ నుండి డబ్బు పంపాలనుకుంటే, ఆ ఎంపికను ఎంచుకుని, ఆపై మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.

Payments Without Net

అప్పుడు మీరు పంపాలనుకుంటున్న మొత్తాన్ని టైప్ చేసి పంపండి. లావాదేవీని పూర్తి చేయడానికి UPI పిన్‌ని నమోదు చేయండి. ఈ విధంగా మీరు ఇంటర్నెట్ లేకుండా ఎవరికైనా సులభంగా డబ్బు పంపవచ్చు.

ఇవి కూడా చదవండి: 

6G Technology: ఇంకా 5G టెక్నాలజీని రానేలేదు.. 6G టెక్నాలజీపై కసరత్తు ప్రారంభించిన కేంద్ర సర్కార్‌..!

Bigg Boss 5 Telugu: దొంగాట వద్దంటూ యానీ మాస్టర్ ఫైర్.. బుద్ది వచ్చిందంటూ జెస్సీ రియలైజ్.. నామినేషన్స్‏లో పింకీ ఆగ్రహం..