Water Purification: పెద్ద శుభవార్త చెప్పిన శాస్త్రవేత్తలు.. చెరువుల్లో నీటిని ఒక్క టాబ్లెట్‌తో తాగునీటిగా మార్చేయవచ్చు!
శాస్త్రవేత్తలు తాగునీటి విషయంలో ఒక పెద్ద శుభవార్త చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ చాలా ప్రాంతాలలో స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో లేదు.
Water Purification: శాస్త్రవేత్తలు తాగునీటి విషయంలో ఒక పెద్ద శుభవార్త చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ చాలా ప్రాంతాలలో స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో లేదు. అలాంటి ప్రదేశాల కోసం, శాస్త్రవేత్తలు ప్రత్యేక రకం హైడ్రోజెల్ టాబ్లెట్‌ను సిద్ధం చేశారు. ఈ టాబ్లెట్ నదులు.. చెరువుల నీటిని ఒక గంటలోపు తాగడానికి పనికి వచ్చేలా చేస్తుంది. ఈ టాబ్లెట్ నమూనా సిద్ధం చేశారు. ఈ టాబ్లెట్ నీటిని 99.9% బ్యాక్టీరియా లేకుండా చేస్తుంది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అమెరికాలోని టెక్సాస్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం.. నీటిని సాధారణంగా బాక్టీరియా రహితంగా మార్చడానికి మరగబెట్టి తాగుతారు. ఇది సమయం.. శక్తి రెండింటినీ ఖర్చు చేస్తుంది.అయితే, ఇప్పుడు కనిపెట్టిన కొత్త హైడ్రోజెల్ టాబ్లెట్‌తో నీటిని చాలా సులభంగా తాగడానికి పనికివచ్చే విధంగా సిద్ధం చేసుకోవచ్చు.
హైడ్రోజెల్ టాబ్లెట్ ఈ విధంగా పనిచేస్తుంది..
శాస్త్రవేత్తలు ఈ హైడ్రోజెల్ టాబ్లెట్‌ను నది లేదా చెరువు నుండి నీటితో నింపిన కంటైనర్‌లో ఉంచాల్సి ఉంటుంది. ఒక గంట టాబ్లెట్ చొప్పించిన తర్వాత నీరు 99.9% బ్యాక్టీరియా లేకుండా ఉంటుంది. ఒక గంట తరువాత, మీరు ఈ టాబ్లెట్‌ను నీటిలో నుండి తీసుకోవచ్చు. నీటిలో ఎలాంటి రసాయనాలు ఉండవు. పరిశోధకులు చెబుతున్నదాని ప్రకారం.. నీటిని చేరుకున్న తర్వాత, ఈ టాబ్లెట్ హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కార్బన్ కణంతో కలసి బ్యాక్టీరియాను చంపుతుంది. మానవుడికి హాని కలిగించే అలాంటి రసాయనాన్ని లేదా ఉప ఉత్పత్తిని నీటిలో తయారు చేయదు. ఈ నీటిని ఎలాంటి భయం లేకుండా తాగవచ్చు.
ఇవి కూడా హైడ్రోజెల్ మాత్రల ప్రయోజనాలు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు, హైడ్రోజెల్ ప్యూరిఫైయర్‌లు ఇతర నీటి శుద్దీకరణ పద్ధతులను మెరుగుపరచడానికి పని చేస్తాయి. ఉదాహరణకు, సౌర స్వేదనం నీటిని శుద్ధి చేయడానికి సూర్యుడి వేడి మీద ఆధారపడాలి. వేడి నుండి ఆవిరైపోయే నీరు సేకరించబడుతుంది. దానిలోని అనేక సూక్ష్మజీవులకు చేరే ప్రమాదం ఉంది. కొత్త హైడ్రోజెల్ టెక్నాలజీతో, ఈ నీటిని శుభ్రంగా శుభ్రపరచవచ్చు.
హైడ్రోజెల్ టెక్నాలజీ రీసెర్చ్‌ను ఉపయోగించడం ఇప్పుడు చిన్న స్థాయిలో ఉంది. కానీ, ఇది నీటిని శుభ్రపరచడానికి చౌకైన, సులభమైన మార్గం. ఈ టెక్నిక్ అన్ని రకాల కంటైనర్లకు ఉపయోగించడానికి సులభంగా ఉంటుంది.
ఈ టాబ్లెట్ ప్రపంచంలోని గేమ్ ఛేంజర్‌గా ఉంటుంది పరిశోధకుడు గుయిహువా యు అంటున్నారు. హైడ్రోవేటర్ టాబ్లెట్ ప్రపంచవ్యాప్తంగా స్వచ్ఛమైన నీటి కొరతను తగ్గించడంలో గేమ్ ఛేంజర్‌గా నిరూపించబడుతుందని ఆయన చెప్పారు. ఇది ఉపయోగించడానికి సులభమైనదిగా ఆయన పేర్కొన్నారు. హైడ్రోజెల్ టాబ్లెట్‌లను ప్రజలకు అందుబాటులో ఉంచడానికి తమ బృందం పనిచేస్తోందని పరిశోధనా బృందం చెబుతోంది. ఇది కాకుండా, దానిని మెరుగుపరచడం.. వివిధ రకాల బ్యాక్టీరియాతో పాటు వైరస్‌లను ఎలా తొలగించాలో కూడా ప్రస్తుతం అన్వేషిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
6G Technology: ఇంకా 5G టెక్నాలజీని రానేలేదు.. 6G టెక్నాలజీపై కసరత్తు ప్రారంభించిన కేంద్ర సర్కార్..!