AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MAA Elections 2021: అంకుల్.. రాజీనామా వద్దంటూ ప్రకాశ్ రాజ్‌ను వారించిన విష్ణు.. మా కొత్త అధ్యక్షుడికి ఓ నెటిజన్ సలహా ఇది..

MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(MAA) ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ నటుడు ప్రకాశ్ రాజ్ సోమవారం ఉదయం సంచలన నిర్ణయం తీసుకోవడం తెలిసిందే.

MAA Elections 2021: అంకుల్.. రాజీనామా వద్దంటూ ప్రకాశ్ రాజ్‌ను వారించిన విష్ణు.. మా కొత్త అధ్యక్షుడికి ఓ నెటిజన్ సలహా ఇది..
Prakash Raj, Manchu Vishnu
Janardhan Veluru
| Edited By: |

Updated on: Oct 11, 2021 | 7:28 PM

Share

MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(MAA) ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ నటుడు ప్రకాశ్ రాజ్ సోమవారం ఉదయం సంచలన నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. మా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన ప్రకాశ్ రాజ్.. ఈ మేరకు మీడియా సమావేశంలో తన నిర్ణయాన్ని ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. తెలుగువాడే మా అధ్యక్షుడు కావాలన్న అంశమే ప్రధానంగా ఎన్నికలు జరిగాయని.. మెజార్టీ సభ్యుల అభిప్రాయం కూడా ఇదే అని ఎన్నికల్లో తేలినందున తన 21 ఏళ్ల మా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తాను తెలుగువాడు కాకపోవడం తన తప్పుకాదని.. తన తల్లిదండ్రుల తప్పుకూడా కాదని ప్రకాష్ రాజ్ కాస్త ఎమోషనల్ అయ్యారు. తాను సాధారణ నటుడిగానే కొనసాగుతానని స్పష్టంచేశారు.  అదే సమయంలో మా ఎన్నికల్లో గెలిచిన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. తన రాజీనామా నిర్ణయాన్ని మా కొత్త అధ్యక్షుడు మంచు విష్ణుకు తెలియజేస్తూ వాట్సప్ ద్వారా ఓ సందేశం పంపారు.

దీనిపై స్పందించిన మంచు విష్ణు.. రాజీనామా వద్దంటూ ప్రకాష్ రాజ్‌ను కోరారు. ఈ మేరకు వాట్సప్ ద్వారా ప్రకాష్ రాజ్‌కు పంపిన ఓ సందేశాన్ని ట్విట్టర్‌లో ఆయన షేర్ చేశారు. భవిష్యత్తు కోసం మనమంతా ఒకటిగా పనిచేద్దామని కోరారు. మీ నిర్ణయం సరైనది కాదన్నారు. తనకంటే ఎంతో అనుభవజ్ఞులైన మీకు గెలుపోటములు ఒకే నాణేనికి ఇరు వైపులన్న విషయం తెలిసన్నారు. ఎమోషనల్ కావద్దని కోరిన మంచు విష్ణు.. మా కుటుంబంలో మీరు కూడా సభ్యుడేనని వ్యాఖ్యానించారు. ‘మా’ను ముందుకు నడిపించే విషయంలో మీ సలహాలు సూచనలు కావాలని, ఇద్దరూ కలిసి పనిచేద్దామని కోరారు. త్వరలోనే మిమ్మిల్ని కలిసి మాట్లాడుతానన్నారు. ఐ లవ్ యూ అంకుల్.. తొందరపాటు నిర్ణయాలు వద్దంటూ ప్రకాశ్ రాజ్‌కు పంపిన వాట్సప్ సందేశంలో మంచు విష్ణు కోరారు.

వివాదానికి ముగింపు పలికేందుకు నెటిజన్ సలహా..

మంచు విష్ణు కామెంట్‌పై స్పందించిన ఓ నెటిజన్.. ఆయనకు ఓ సలహా ఇచ్చారు.  ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అంటూ హేళన చేసిన నరేష్, కోట గారు, మరికొందర్ని అలాంటి వాఖ్యలు మరోసారి రిపీట్ కానీయద్దు అని కొత్త మా అధ్యక్షుడిగా చెప్పాలని సూచించారు. అలాగే బండి సంజయ్ వాఖ్యలతో మ కి సంబంధం లేదని చెప్పాలన్నారు. తాము ఫిల్మ్  లవర్స్.. మమ్మల్ని మీ అందరు అలరించాలంటూ కోరారు. తద్వారా ప్రకాశ్ రాజ్‌తో నెలకొన్న వివాదాన్ని కరెక్ట్ చేయాలని ఆ నెటిజన్ విష్ణుకు సూచించారు.

Also Read..

Devaragattu Bunny Festival 2021: కళ్ళలో భక్తి… కర్రల్లో పౌరుషం.. బన్నీ ఉత్సవానికి అంతా రెడీ..

Mysore Tourism Places: ప్రకృతి ప్రేమికులకు స్వర్గదామం.. భారత రాజసానికి చిరునామా.. మైసూరులో చూడాల్సిన ప్రదేశాలు ఇవే..