Mohan Babu: ‘టీటీడీ సదుపాయాలు బ్రహ్మాండం.. కానీ’.. తిరుపతి తొక్కిసలాటపై స్పందించిన మోహన్ బాబు

తిరుపతిలో బుధవారం (జనవరి 08) రాత్రి జరిగిన తొక్కిసలాట అందరినీ కలచివేస్తోది. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద పరిస్థితి అదుపు తప్పడంతో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలయ్యాయి.

Mohan Babu: 'టీటీడీ సదుపాయాలు బ్రహ్మాండం.. కానీ'.. తిరుపతి తొక్కిసలాటపై స్పందించిన మోహన్ బాబు
Mohan Babu
Follow us
Basha Shek

|

Updated on: Jan 09, 2025 | 2:42 PM

తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద బుధవారం రాత్రి తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు స్విమ్స్, రుయా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా వైకుంఠ ఏకదాశి సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుందామన్న ఆశతో తిరుపతికి వచ్చిన భక్తులు ఇలా తొక్కిసలాటలో కన్నుమూయడం అందరినీ కలచివేస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మాజీ సీఎం జగన్, హోం మంత్రి అనిత, టీటీడీ ఛైర్మన్ తో పాటు పలువురు మంత్రులు తిరుపతి తొక్కిసలాట ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.25లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. కాగా ఈ ఘటనపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. తాజాగా సీనియర్ నటుడు మోహన్ బాబు తిరుపతి ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయ‌ప‌డిన భ‌క్తులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షించారు.

‘తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు టికెట్ల కోసం తిరుపతిలో కౌంటర్ల వద్దకు వెళ్ళి అక్కడ జరిగిన తొక్కిసలాటలో కొంతమంది మరణించడం నా హృదయాన్ని కలిచివేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల కోసం తీసుకునే జాగ్రత్తలు, సదుపాయాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అయినా ఇలా జరగడం దురదృష్టకరం. గాయపడిన భక్తులు త్వరగా కోలుకోవాలి. మరణించిన వారి కుటుంబాలకు ఆ వైకుంఠవాసుడు మనోధైర్యాన్ని కల్పించాలని ప్రార్థిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు మోహన్ బాబు.

ఇవి కూడా చదవండి

కాా వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో పలు చోట్ల టోకెన్ల జారీకి టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ టికెట్ల కోసం భక్తులు భారీ ఎత్తున రాగా.. తొక్కిసలాట చోటు చేసుకుంది.

మోహన్ బాబు ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.