Miss Shetty Mr Polishetty Collections: సినిమా బాగుంది.. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ కలెక్షన్స్ ఎంత వచ్చాయంటే..
సెప్టెంబర్7న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో అనుష్క, నవీన్ కెమిస్ట్రీ ఆకట్టుకోగా.. ఈ కామెడీ ఎంటర్టైనర్ కు సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. అయితే సినిమా బాగున్నప్పటికీ రిలీజ్ డేట్ విషయంలో టీం కాస్త తడబడినట్లుగా తెలుస్తోంది. ఓవైపు షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది. దీంతో 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమా జవాన్ హవాలో వెనకబడింది. జవాన్ సినిమాకు ముందు కానీ.. లేదా ఆ తర్వాత గ్యాప్ తీసుకుని రిలీజ్ చేసి ఉంటే ఈ సినిమా రిజల్ట్, కలెక్షన్స్ వేరేలెవల్లో ఉండేది.

బాహుబలి, నిశ్శబ్దం సినిమాల తర్వాత అనుష్క శెట్టి నటించిన లేటేస్ట్ చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. చాలా కాలం గ్యాప్ తర్వాత స్వీటీ నటించిన ఈ సినిమా కోసం అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేశారు. ఇందులో జాతిరత్నాలు హీరో నవీన్ పోలిశెట్టిగా ప్రధాన పాత్ర పోషించగా.. డైరెక్టర్ మహేష్ బాబు దర్శకత్వం వహించారు. సెప్టెంబర్7న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో అనుష్క, నవీన్ కెమిస్ట్రీ ఆకట్టుకోగా.. ఈ కామెడీ ఎంటర్టైనర్ కు సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. అయితే సినిమా బాగున్నప్పటికీ రిలీజ్ డేట్ విషయంలో టీం కాస్త తడబడినట్లుగా తెలుస్తోంది. ఓవైపు షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది. దీంతో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా జవాన్ హవాలో వెనకబడింది. జవాన్ సినిమాకు ముందు కానీ.. లేదా ఆ తర్వాత గ్యాప్ తీసుకుని రిలీజ్ చేసి ఉంటే ఈ సినిమా రిజల్ట్, కలెక్షన్స్ వేరేలెవల్లో ఉండేది.
ప్రస్తుతం ఈ సినిమాకు పాజిటివ్ మౌత్ టాక్ ఉన్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం అంతగా రాలేదు. మొదటి రెండు రోజులు కలెక్షన్స్ అంతంత మాత్రంగా వచ్చినా.. మూడవ రోజు వీకెండ్ ఎఫెక్ట్ పడింది. దీంతో మూడవ రోజు కలెక్షన్స్ పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.1.35 కోట్లు షేర్ అందుకోగా.. రెండవ రోజు రూ.1.21 కోట్లు రాబట్టింది. ఇక మూడవ రోజు అంతకంటే ఎక్కువగా రూ.2.08 కోట్ల షేర్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు రూ. 9 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది.
View this post on Instagram
ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ గా రూ.12.50 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇంకా రూ.13.50 కోట్లు రాబట్టుకోవాలి. కానీ ఇప్పటివరకు వచ్చింది కేవలం రూ.9 కోట్లు మాత్రమే. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి నష్టాల నుంచి బయటకు రావాలంటే ఇంకా రూ.4.66 కోట్లు రాబట్టా్ల్సి ఉంది. అయితే ఈ ఆదివారం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి కలెక్షన్స్ లెక్కలు మారనున్నట్లు తెలుస్తోంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




