Jawan Collections: బాక్సాఫీస్‌ వద్ద ‘జవాన్‌’ కలెక్షన్ల ర్యాంపేజ్‌.. మూడు రోజుల్లో ఎన్నికోట్లు రాబట్టిందంటే?

బాలీవుడ్ సూపర్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ నటించిన తాజా చిత్రం జవాన్‌. సౌత్‌ ఇండియన్‌ డైరెక్టర్‌ అట్లీ తెరకెక్కించిన ఈ మూవీలో నయనతార హీరోయిన్‌. దీపికా పదుకొణె, విజయ్‌ సేతుపతి, ప్రియమణి, సంజయ్‌ దత్‌, సాన్యా మల్హోత్రా, యోగిబాబు సునీల్ గ్రోవర్, సంజీత్ భట్టాచార్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్‌ 7న విడుదలైన జవాన్‌ బ్లాక్‌ బస్టర్‌ టాక్‌తో దూసుకెళుతోంది. ప్రపంచవ్యాప్తంగా పదివేలకు పైగా థియేటర్లలో

Jawan Collections: బాక్సాఫీస్‌ వద్ద 'జవాన్‌' కలెక్షన్ల ర్యాంపేజ్‌.. మూడు రోజుల్లో ఎన్నికోట్లు రాబట్టిందంటే?
Jawan Movie
Follow us
Basha Shek

|

Updated on: Sep 10, 2023 | 4:22 PM

బాలీవుడ్ సూపర్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ నటించిన తాజా చిత్రం జవాన్‌. సౌత్‌ ఇండియన్‌ డైరెక్టర్‌ అట్లీ తెరకెక్కించిన ఈ మూవీలో నయనతార హీరోయిన్‌. దీపికా పదుకొణె, విజయ్‌ సేతుపతి, ప్రియమణి, సంజయ్‌ దత్‌, సాన్యా మల్హోత్రా, యోగిబాబు సునీల్ గ్రోవర్, సంజీత్ భట్టాచార్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్‌ 7న విడుదలైన జవాన్‌ బ్లాక్‌ బస్టర్‌ టాక్‌తో దూసుకెళుతోంది. ప్రపంచవ్యాప్తంగా పదివేలకు పైగా థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు కొల్లగొడుతోంది. మొదటి రోజే రూ. 130 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన జవాన్‌ రెండో రోజూ రూ.113 కోట్లకు పైగా వసూలు చేసింది. మొత్తమ్మీద రెండు రోజుల్లోనే 250 కోట్లకు చేరువైంది. ఇక వీకెండ్‌ కావడంతో శనివారం (సెప్టెంబర్‌ 9) బాక్సాఫీస్‌ వద్ద మరింత దూకుడు చూపించాడు జవాన్‌. ఏకంగా రూ.145 కోట్లు వచ్చాయి. మొత్తమ్మీద మూడు రోజుల్లోనే సుమారు రూ.385కోట్ల గ్రాస్ కలెక్షన్‍లను సాధించినట్లు ట్రేడ్‌ నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుతం జవాన్‌ జోరు చూస్తుంటే 4 రోజుల్లోనే రూ. 500 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశముందని తెలుస్తోంది.

కలిసొచ్చిన వీకెండ్.. నాలుగు రోజుల్లోనే రూ. 500 కోట్ల క్లబ్ లో..

హిందీతో పాటు తమిళ్‌, తెలుగు భాషల్లోనూ జవాన్‌ జోరు చూపిస్తున్నాడు. కేరళలోనూ భారీ కలెక్షన్లు వస్తున్నాయి. పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన జవాన్‌ సినిమాలో మల్టీఫుల్‌ రోల్స్‌, షేడ్స్‌లో కనిపించాడు షారుక్‌. దీనికి తోడు అనిరుధ్‌ అందించిన బీజీఎమ్‌ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది. షారుక్‌ సొంత బ్యానర్‌ రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్‌పై గౌరీఖాన్‌ జవాన్‌ సినిమాను నిర్మించారు. పఠాన్‌, జవాన్‌.. ఇలా బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్లు కొట్టడంతో ఫుల్‌ ఖుషీ అవుతున్నారు షారుక్‌ ఫ్యాన్స్‌. ఇప్పటికే పలు రికార్డులను ఖాతాలో వేసుకున్న జవాన్‌ రాబోయే రోజుల్లో మరెన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.

ఇవి కూడా చదవండి

ఇతర భాషల్లోనూ అదరగొడుతోన్న జవాన్

థియేటర్ల వద్ద అభిమానుల హోరు..   పండగ వాతావరణమే..

జవాన్ బ్లాక్ బస్టర్ ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!