Pawan Kalyan: ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలుసు.. పవన్ గెలుపుపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్..
ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా జనసేన అధినేతకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ ప్రముఖులు, నటీనటులు, అభిమానులు నెట్టింట పవన్ కు అభినందనలు తెలుపుతున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు విజయోత్సవ సంబరాలు చేసుకుంటున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన సోదరుడు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. వైసీపీ అభ్యర్థి వంగా గీత మీద భారీ అధిక్యంతో గెలుపొందారు. దాదాపు డెబ్బై వేలకు పైగా మెజార్టీతో పిఠాపురంలో సరికొత్త చరిత్ర సృష్టంచారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా జనసేన అధినేతకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ ప్రముఖులు, నటీనటులు, అభిమానులు నెట్టింట పవన్ కు అభినందనలు తెలుపుతున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు విజయోత్సవ సంబరాలు చేసుకుంటున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన సోదరుడు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
“డియర్ కళ్యాణ్ బాబు..ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా వుంది. నువ్వు Game Changer వి మాత్రమే కాదు, Man of the match వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది !!నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే! ఈ అద్భుతమైన ప్రజా తీర్పు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ కలల్ని, నువ్వేర్పరుచుకున్న లక్ష్యాల్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ, శుభాభినందనలు. నీవు ప్రారంభించే ..ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని , విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు చిరు.
డియర్ కళ్యాణ్ బాబు..ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా వుంది. నువ్వు Game Changer వి మాత్రమే కాదు, Man of the match వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం…
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 4, 2024
అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. “ప్రియమైన చంద్రబాబు నాయుడు గారికి , చరిత్రలో అరుదైన విజయాన్ని అందుకున్న మీకు ముందుగా శుభాకాంక్షలు, అభినందనలు.ఈ మహత్తర విజయం, మీ మీద ప్రజలకు వున్న నమ్మకానికి, మీ నాయకత్వ పటిమకు, రాష్ట్రానికి గత వైభవం తిరిగి తేగలిగిన మీ దక్షతకు నిదర్శనం. రాజకీయ దురంధరులైన మీ మీద, పవన్ కల్యాణ్, నరేంద్ర మోడీ గారి మీద ప్రజలు కనపరచిన విశ్వాసాన్ని సంపూర్ణంగా నిలబెట్టుకొని, రాజధాని లేని, గాయపడిన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టి నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు.
ప్రియమైన చంద్రబాబు నాయుడు గారికి , చరిత్రలో అరుదైన విజయాన్ని అందుకున్న మీకు ముందుగా శుభాకాంక్షలు, అభినందనలు.👏👏 💐💐 ఈ మహత్తర విజయం, మీ మీద ప్రజలకు వున్న నమ్మకానికి, మీ నాయకత్వ పటిమకు, రాష్ట్రానికి గత వైభవం తిరిగి తేగలిగిన మీ దక్షతకు నిదర్శనం. రాజకీయ దురంధరులైన మీ మీద, పవన్…
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 4, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




