AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్‌.. మీరూ పాల్గొనవచచ్చు.. ఎలాగంటే?

ఆహా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సమర్పణలో కనువినీ ఎరుగని రీతిలో సగర్వంగా సౌత్ ఇండియాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమ తరఫున మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్‌.. మీరూ పాల్గొనవచచ్చు.. ఎలాగంటే?
Megastar Chiranjeevi
Basha Shek
|

Updated on: Mar 18, 2024 | 4:47 PM

Share

ఆహా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సమర్పణలో కనువినీ ఎరుగని రీతిలో సగర్వంగా సౌత్ ఇండియాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమ తరఫున మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. భారతదేశ ప్రభుత్వం అందించే అత్యుత్తమ పురస్కారాల్లో రెండవ గొప్ప అవార్డుగా భావించే పద్మవిభూషణ్‌కు ఈ మధ్య చిరంజీవి ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరు కానుండటం అనేది మరింత ప్రాముఖ్యతను తీసుకొస్తుంది. మెగాస్టార్ చిరంజీవి ఈ సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్‌కు ముఖ్య అతిథిగా హాజరు కానుండటం అనేది కార్యక్రమానికి గొప్పదనాన్ని తీసుకు రావటమే కాదు, ఇలాంటి ఫిల్మ్ ఫెస్టివల్స్ సినీ ఇండస్ట్రీ ఇవ్వాల్సిన ప్రాధాన్యత అందరికీ తెలుస్తుంది. పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతగా సినిమాపట్ల అంకిత భావం, ప్రావీణ్యత వంటి లక్షణాలను బలంగా కలిగి ఉన్నారు. ఈ వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతుండటం అనేది సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయటంలో ఎలాంటి నిబద్ధను కలిగి ఉన్నారనే అంశాన్ని తెలియజేస్తోంది. ఇలాంటి ఉత్సవాన్ని నిర్వహించటం అనేది ఔత్సాహిక నిర్మాతలకు, సినీ ప్రముఖులకు మరింత స్ఫూర్తిదాయకంగా ఉంది.

సాధారణంగా జరిగే ఫిల్మ్ ఫెస్టివల్స్‌ను మించేలా ఈ సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్‌ ఉండనుంది. సినిమాల ప్రదర్శనలు, సినిమాలకు సంబంధించిన చర్చలు, ఔత్సాహిక నిర్మాతలను ప్రోత్సహించేలా ఇదొక ప్రత్యేకమైన వేదికగా నిలుస్తుంది. ప్రతిభావంతులు వారి నైపుణ్యాలను ప్రదర్శించడానికి, అలాగే వారికి కావాల్సిన సినీ పరిశ్రమ పరిజ్ఞానాన్ని సంపాదించుకోవటానికి ఈ వేడుక స్నేహపూర్వక వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది. ఇప్పటి వరకు చాలా సినీ ఉత్సవాలు జరిగాయి. అయితే అలాంటి సాంప్రదాయలకు భిన్నంగా చిత్ర పరిశ్రమలో ఎదగాలనుకుంటున్న ప్రతిభావంతులను మరింత విషయ సేకరణను చేసుకుని మరింతగా అభివృద్ధి చెందటానికి ఇదొక వేదికగా ఉపయోగపడనుంది.

సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ అనేది కేవల సినిమాలకు సంబంధించిన వేడుకో, ప్రదర్శన ప్రాంతమో కాదు. ఇది మన వారసత్వాన్ని నేటి తరానికి తెలియజేసేది, మన సినీ సాంప్రదాయాన్ని అవగతం చేస్తుంది. ఆహా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సమర్పణలో జరగబోతున్న ఈ సినీ వేడుక భారతీయ సినీ వారసత్వాన్ని మరింత వికసింప చేస్తుంది. మన మేకర్స్‌ కొత్త విషయాలను నేర్చుకోవటంలో దోహదపడుతుంది. మన సౌత్ ఇండియన్ సినిమాకు సంబంధించిన ఉత్తేజకరమైన ప్రయాణంలో మీరు భాగం కావటానికి మీరు సిద్ధమవండి. అందుకోసం మార్చి 22వ తేదీని మీ క్యాలెండర్‌లో ప్రత్యేకంగా మార్క్ చేసుకోండి. ఇందులో పాల్గొనాల్సినవారు బుక్ మై షోలో ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవచ్చు..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.