Vijayawada: రోడ్డు పక్కన దివ్యాంగుడితో గాత్రం కలిపిన టాలీవుడ్ ఫేమస్ సింగర్.. గుర్తుపట్టారా..?
నువ్వు ఐశ్వర్యారాయ్‌లా అందంగా పుట్టి.. రియల్ హీరోయిన్ కాలేకపోవొచ్చు. కానీ సేవాగుణంతో అందరూ మెచ్చిన మరో మథర్ థెరిస్సా అవ్వొ చ్చు. అందుకు కావాల్సింది మంచి మనసు. కొందరు టాలెంట్ ఉన్న వ్యక్తులకు పొగరు ఉంటుంది. కింద నుంచి వచ్చినవారు కూడా కాస్త డబ్బులు సంపాదించగానే ఓవరాక్షన్ చేస్తారు. కానీ ఈమె మాత్రం..

మంచి టాలెంట్ ఉన్న అందరికీ మంచి మనసు ఉండాలని లేదు. టాలెంట్ ఉన్న చాలామందికి అహంకారం ఉండటం చూస్తుంటాం. కింద నుంచి ఎదిగినవారు కూడా కాస్త ఎదిగిన తర్వాత ఎందుకు అలా బిహేవ్ చేస్తారో అర్థం కాదు. కానీ కొందరు మాత్రం.. ఎంత ఎదిగినా ఒదిగే అంటారు. అలాంటి ఓ పర్సన్ గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. తనెవరో కాదు.. టాలీవుడ్‌లోని ఏకైక ఫీమేల్ సంగీత దర్శకురాలు ఎం ఎం శ్రీలేఖ. తన అందమైన గాత్రంతో ఎంతోమందిని ఆకట్టుకున్న ఆమె.. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్‌గానూ అద్భుతమైన సినిమాలు చేసింది.
మేల్ డామినేషన్ ఎక్కువగా ఉండే సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ పేజీ క్రియేట్ చేసుకుంది. 75 చిత్రాలకు పైగా సంగీతాన్ని అందించి ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకు మ్యూజిక్ అందించిన మహిళా సంగీత దర్శకురాలుగా రికార్డ్ క్రియేట్ చేసింది ఎం ఎం శ్రీలేఖ. కంటేనే అమ్మ అని అంటే ఎలా’? అనే పాటకి ఆమె చేసిన ట్యూనింగ్ ఎవర్‌గ్రీన్ అంతే. తెలుగు, తమిళ్, కన్నడ చిత్రాలకు శ్రీలేఖ మ్యూజిక్ అందించారు. ఇటీవల శ్రీలేఖ చేసిన ఓ పనిని నెటిజన్స్ ముగ్ధులయ్యారు. ఆమె సేవాగుణం ఉన్న పర్సన్ అని కామెంట్స్ పెడుతున్నారు. ఇటీవల పని మీద.. విజయవాడ వెళ్లారు శ్రీలేఖ. అక్కడ రోడ్డు పక్కన దివ్యాంగులు కచేరి నిర్వహించడం చూసి వారితో గాత్రం కలిపింది. తన సోదరుడు కీరవాణి ట్యూన్ చేసిన.. అల్లరి ప్రియుడు చిత్రంలోని రోజ్ రోజ్ రోజా పువ్వు పాటను.. వారితో కలిసి పాడింది. ఆ పాటను పాడిన అంధుడైన గాయకుడికి మంచి జరగాలని కోరుకుంటున్నట్లు ఆమె ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. ఇలాంటివారికి సహాయ సహకారాలు అందించాలని ఆమె సూచించింది.
View this post on Instagram
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి



