- Telugu News Photo Gallery Cinema photos Power Star Pawan Kalyan's Ustaad Bhagat Singh Movie New Teaser will be on March 19th details here Telugu Heroes Photos
Ustaad Bhagat Singh: ఊహించని షాక్ ఇచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్.! మ్యాటరేంటంటే.?
ఊహించినపుడు ఇచ్చే గిఫ్ట్ కంటే.. అస్సలు ఆలోచనల్లో కూడా లేనపుడు.. ఇది రాదు అని ఫిక్సైపోయినపుడు ఇచ్చే బహుమతికి విలువ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడలాంటి గిఫ్ట్‌నే ప్లాన్ చేస్తున్నారు ఉస్తాద్ భగత్ సింగ్ టీం. రెండేళ్లు వేచి చూసిన హరీష్ శంకర్ సైతం ఇప్పట్లో లేదు.. రాదని ఫిక్సైపోయి రవితేజ సినిమాతో బిజీ అయిపోయారు. అయితే ఇలాంటి సమయంలో ఉన్నట్లుండి ఇటు ఉస్తాద్ టీం నుంచి ఎక్స్‌పెక్ట్ ది అన్ఎక్స్‌పెక్టెడ్ అనే ట్వీట్ వచ్చింది.
Updated on: Mar 18, 2024 | 5:47 PM

ఊహించినపుడు ఇచ్చే గిఫ్ట్ కంటే.. అస్సలు ఆలోచనల్లో కూడా లేనపుడు.. ఇది రాదు అని ఫిక్సైపోయినపుడు ఇచ్చే బహుమతికి విలువ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడలాంటి గిఫ్ట్‌నే ప్లాన్ చేస్తున్నారు ఉస్తాద్ భగత్ సింగ్ టీం.

రెండేళ్లు వేచి చూసిన హరీష్ శంకర్ సైతం ఇప్పట్లో లేదు.. రాదని ఫిక్సైపోయి రవితేజ సినిమాతో బిజీ అయిపోయారు. అయితే ఇలాంటి సమయంలో ఉన్నట్లుండి ఇటు ఉస్తాద్ టీం నుంచి ఎక్స్‌పెక్ట్ ది అన్ఎక్స్‌పెక్టెడ్ అనే ట్వీట్ వచ్చింది.

మీరస్సలు ఊహించనిది ఇవ్వబోతున్నామంటూ ఉస్తాద్ టీం ట్వీట్ చేసారు. దాంతో సీన్‌లోనే లేని సినిమా దెబ్బకు నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతుందిప్పుడు.

పవన్ రాజకీయాలతో బిజీ అయిపోవడంతో ఉస్తాద్‌కి బ్రేకులు పడి 4 నెలలు దాటిపోయింది. కేవలం 5 రోజులు మాత్రమే షూట్ చేసారు హరీష్ శంకర్. అందులోంచే ఓ టీజర్ విడుదల చేసారు కూడా.

తాజాగా ఉస్తాద్ నుంచి మరో టీజర్ విడుదల చేయనున్నారు. పొలిటికల్ ఫేవర్ ఉండేలా అదిరిపోయే డైలాగ్ టీజర్ సిద్ధం చేస్తున్నారు మేకర్స్. మార్చి 19న ఈ గ్లింప్స్ రాబోతుంది.

పవర్‌ఫుల్ పొలిటికల్ పంచులతో టీజర్‌ని సిద్ధం చేశారని, ఆ డైలాగులు పవన్‌కి పొలిటికల్ గ్రౌండ్‌లో పనికొస్తాయన్నది ఇంకో మాట. ఉస్తాద్ భగత్‌సింగ్‌లో ఈ మధ్య గ్లాసు గురించి పంచ్‌లు రాశారు హరీష్‌శంకర్. ఈ పంచ్‌ల గురించి పవన్‌కల్యాణ్ రాజకీయ వేదికల మీద కూడా ప్రస్తావించారు.




