- Telugu News Photo Gallery Cinema photos Good Night Movie Actress Meetha Raghunath ties the knot in a traditional south Indian Ceremony
Meetha Raghunath: అరెరె.. కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్‌కి అప్పుడే పెళ్లయిపోయింది..వరుడెవరంటే? ఫొటోస్
కోలీవుడ్ అందాల సుందరి మీతా రఘునాత్ తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ప్రేమకథా చిత్రాలతో తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ పెళ్లిపీటలెక్కేసింది. ప్రస్తుతం ఈ క్యూటీ పెళ్లి ఫొటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.
Updated on: Mar 18, 2024 | 4:10 PM

కోలీవుడ్ అందాల సుందరి మీతా రఘునాత్ తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ప్రేమకథా చిత్రాలతో తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ పెళ్లిపీటలెక్కేసింది. ప్రస్తుతం ఈ క్యూటీ పెళ్లి ఫొటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

'ముదల్ నీ ముడివుం' అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మీతా రఘునాథ్. మొదటి సినిమాలోనే అందం, అభినయంతో కుర్రాళ్ల మనసులను దోచుకుంది.

ఇక గతేడాది విడుదలైన గుడ్ నైట్ సినిమా అయితే మీతాకు ఎనలేని క్రేజ్ ను తీసుకొచ్చింది. తెలుగులోనూ ఈ సినిమా రిలీజైంది. అచ్చెం పక్కింటమ్మాయిలా కనిపించి తెలుగు అబ్బాయిల గుండెల్లో స్థానం సంపాదించుకుంది.

మరిన్ని సినిమాల్లో మీతాను చూడాలని ఫ్యాన్స్ అనుకుంటుంటే.. ఈ ముద్దుగుమ్మ మాత్రం సడెన్ గా పెళ్లిపీటలెక్కేసింది. గత ఏడాది ఆమె నిశ్చితార్థం జరగ్గా ఈరోజు (మార్చి 18) వివాహం జరిగింది.

ఊటిలో ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల మధ్య మీతా రఘునాథ్ వివాహ వేడుక జరిగింది. అయితే భర్త పేరు, తదితర వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.

తన పెళ్లికి సంబంధించిన ఫొటోలను ' నా నిండు హృదయం' అనే క్యాప్షన్ తో షేర్ చేసింది మీతా. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు మీతా దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.