- Telugu News Photo Gallery Rerelease craze in Tollywood, Happy Days and Ee Rojullo movies may release soon
Tollywood: టాలీవుడ్ లో రీరిలీజ్ క్రేజ్.. త్వరలో ‘హ్యపీడేస్, ఈరోజుల్లో’ విడుదల
పోకిరి, సింహాద్రి లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన తర్వాత రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. ఈ సినిమాల 4కె వెర్షన్లు కొన్ని రోజుల పాటు సూపర్ హిట్స్ గా నిలవగా, వాలెంటైన్స్ డే రిలీజైన ఓయ్ వారం రోజుల పాటు భారీ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.
Updated on: Mar 18, 2024 | 1:46 PM

పోకిరి, సింహాద్రి లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన తర్వాత రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. ఈ సినిమాల 4కె వెర్షన్లు కొన్ని రోజుల పాటు సూపర్ హిట్స్ గా నిలవగా, వాలెంటైన్స్ డే రిలీజైన ఓయ్ వారం రోజుల పాటు భారీ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

పాత సినిమాలు బాగా ఎంటర్ టైన్ చేస్తుండటంతో త్వరలో మరో ఆసక్తికరమైన మూవీ రీరిలీజ్ కాబోతోంది. టాలీవుడ్ లో మారుతిని డిమాండ్ ఉన్న దర్శకుడిగా మార్చిన షార్ట్ బడ్జెట్ సినిమా ఈరోజుల్లో కూడా రిరీలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా డబుల్ ఎమోషన్స్, వల్గారిటీతో తెరకెక్కింది.

మార్చి 23న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ను ప్రేక్షకులను ఎలా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాల్సిందే. మరోవైపు ట్రెండ్ సెట్ యూత్ ఫుల్ కాలేజ్ డ్రామా మూవీ కూడా రీరిలీజ్ కాబోతోంది. ఈ మూవీ ఎవరిదో కాదు.. శేఖర్ కమ్ములది.

ఆయన తెరకెక్కించిన టాలీవుడ్ లో హ్యాపీడేస్ క్లాసిక్ గా నిలిచిపోయింది. ఏప్రిల్ రెండు లేదా మూడో వారాల్లో ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ రెండూ బాక్సాఫీస్ వద్ద ఎలా ఆకట్టుకుంటాయో వేచి చూడాలి.

అయితే హ్యాపీడేస్ మూవీకి కుర్రకారులో మంచి ఫాలోయింగ్ ఉంది. అప్పట్లో రిలీజ్ అయిన ఈ మూవీకి ఇప్పటికి క్రేజ్ ఉంది. మళ్లీ రిలీజ్ అవుతుండటంతో కాలేజీ యూత్ ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.