- Telugu News Photo Gallery Mix Black Pepper And Ghee Together For Good Health, Know All Benefits Here
Black Pepper And Ghee Benefits: స్పూన్ నెయ్యిలో చిటికెడు మిరియాల పొడి కలిపి తీసుకుంటే.. ఆ సమస్యలు చిటికెలో మాయం!
నేటి కాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్నారు. అస్థవ్యస్థమైన జీవనశైలి కారణంగా చిన్న వయసులోనే దీర్ఘకాలిక వ్యాధుల భారీన పడుతున్నారు. దీంతో రోజూ రకరకాల మందులు తీసకుంటూ శరీరం ఆరోగ్యంగా ఉండేలా చూసుకుంటున్నారు. అయితే ఈ వంట గదిలో ఉండే ఈ రెండు పదార్ధాలను కలిపి తింటే ఇకపై మందులు వేసుకోవల్సిన అవసరం ఉండదంటున్నారు ఆరోగ్య నిపుణులు..
Updated on: Mar 18, 2024 | 1:42 PM

తరచూ జలుబు, తుమ్ములు వంటి వాటితో బాధపడే వారు నీటిలో పసుపు, మిరియాల పొడి వేసి మరిగించి తీసుకోవడం వల్ల ఆయా సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. చిగుళ్ల నుండి రక్తం కారడం, చిగుళ్ల వాపు సమస్యలు ఉన్న వారు మిరియాల పొడిని, రాళ్ల ఉప్పుతో కలిపి చిగుళ్లపై ఉంచడం వల్ల చిగుళ్ల సమస్యలు తగ్గు ముఖం పడతాయి.

అవేంటంటే.. నెయ్యి, నల్ల మిరియాలు. ఒక చెంచా నెయ్యి తీసుకుని, అందులో కొన్ని నల్ల మిరియాల పొడిని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత దీనిని తినాలి. ప్రతిరోజూ ఇలా ఒక చెంచా తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు.

నెయ్యి, నల్ల మిరియాలు శరీర రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది. ఇది చాలా వ్యాధులను నయం చేయగల చక్కని ఇంటి నివారిణి. నెయ్యి, నల్ల మిరియాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి. నెయ్యిలో ఉండే ఎ, ఇ, కె విటమిన్లు శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

కీళ్ల నొప్పులు వంటి సమస్యలు ఉన్నవారు రోజూ దీనిని రోజూ ఒక చెంచా చొప్పున తినాలి. కీళ్ల వాపు, నొప్పిని తగ్గించడంలో నెయ్యి సహాయపడుతుంది. నెయ్యి, మిరియాలు తింటే గుండెకు, కాలేయానికి మేలు చేస్తుంది. కాబట్టి మీరూ కాలేయ సమస్యతో బాధపడుతున్నట్లయితే, ఈ హోం రెమెడీని ప్రతిరోజూ తినవచ్చు.

ఏడాది పొడవునా జలుబు, దగ్గు వంటి సమస్యలు ఉంటే నెయ్యి, నల్ల మిరియాల పొడి మిశ్రమం తింటే త్వరిత గతిన ఉపశమనం పొందుతారు. ఇది వాయుమార్గాన్ని శుభ్రంగా ఉంచుతుంది. ఫలితంగా ముక్కు బ్లాక్ అవకుండా సాఫీగా ఉంటుంది.




