- Telugu News Photo Gallery Cricket photos Know Who is Shreyanka Patil of RCB, who took 4 wickets in WPL final against Delhi Capitals
3.3 ఓవర్లలో 4 వికెట్లు.. బౌలింగ్‌తో షాకిస్తోన్న ఆర్‌సీబీ బ్యూటీ.. హీరోయిన్లకే అసూయ పుట్టిస్తోన్న అందం.. ఎవరీ శ్రేయాంక?
RCB Shreyanka Patil: ఢిల్లీ వర్సెస్ బెంగళూరు మధ్య జరిగిన డబ్ల్యూపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రేయాంక పాటిల్ 3.3 ఓవర్లు బౌలింగ్ చేసి 12 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తన ఖాతాలో వేసుకుంది. చివరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ మాగ్ లానింగ్ (23), మిన్ను మణి (5), అనురాధ రెడ్డి (10), తానియా భాటియా (0)లను శ్రేయంక పాటిల్ అవుట్ చేసింది. విరాట్ కోహ్లీని తన రోల్ మోడల్‌గా భావించే, ఈ ఆర్‌సీబీ ప్లేయర్.. ఎవరంటూ సోషల్ మీడియాలో తెగ శోధిస్తున్నారు. ఆమె ప్రొఫైల్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Mar 18, 2024 | 3:28 PM

DC vs RCB WPL Final 2024: ఆదివారం జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 (WPL 2024) ఫైనల్ మ్యాచ్‌లో శ్రేయాంక పాటిల్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మరపురాని గాయాన్ని అందించింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఊహించని విధంగా ఫైనల్ మ్యాచ్‌లో శ్రేయాంక పాటిల్ షాక్ ఇచ్చింది. దీంతో నెటిజన్లు ఆమె కోసం సోషల్ మీడియాలో శోధిస్తున్నారు. అసలు ఎవరీ శ్రేయాంక పాటిల్ అంటూ అడుగుతున్నారు.

శ్రేయాంక పాటిల్ 31 జులై 2002న కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది. శ్రేయాంక పాటిల్ విరాట్ కోహ్లీని తన రోల్ మోడల్‌గా భావిస్తుంది. 9 ఏళ్ల వయసులో క్రికెట్ ఆడడం ప్రారంభించింది. శ్రేయాంక పాటిల్ అద్భుతమైన ఆఫ్ స్పిన్ బౌలర్. భారత్ తరపున శ్రేయాంక పాటిల్ 2 వన్డేల్లో 4 వికెట్లు, 6 టీ20ల్లో 8 వికెట్లు పడగొట్టింది.

విదేశీ లీగ్‌కు ఒప్పందం కుదుర్చుకున్న తొలి అన్‌క్యాప్డ్ భారత మహిళా క్రికెటర్‌గా శ్రేయాంక పాటిల్ నిలిచింది. గతేడాది ఉమెన్స్ కరీబియన్ ప్రీమియర్ లీగ్ (WCPL)లో శ్రేయాంక పాటిల్‌ను గయానా అమెజాన్ వారియర్స్ జట్టు కొనుగోలు చేసింది. టైటిల్ మ్యాచ్‌లో శ్రేయాంక పాటిల్ 4 వికెట్లు తీసి ఢిల్లీ క్యాపిటల్స్ వెన్ను విరిచింది. ఈ మ్యాచ్‌లో శ్రేయాంక పాటిల్ డేంజరస్ బౌలింగ్ చేసి ఢిల్లీ క్యాపిటల్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై పైచేయి సాధించేలా చేసింది.

ఈ మ్యాచ్‌లో శ్రేయాంక పాటిల్ 3.3 ఓవర్లు బౌలింగ్ చేసి 12 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తన ఖాతాలో వేసుకుంది. చివరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ మాగ్ లానింగ్ (23), మిన్ను మణి (5), అనురాధ రెడ్డి (10), తానియా భాటియా (0)లను శ్రేయంక పాటిల్ అవుట్ చేసింది.

WPL 2024 టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసినందుకుగాను శ్రేయాంక పాటిల్ పర్పుల్ క్యాప్ టైటిల్‌తోపాటు రూ. 5 లక్షలు అందుకుంది. WPL 2024లో శ్రేయాంక పాటిల్ అత్యధికంగా 13 వికెట్లు పడగొట్టింది. శ్రేయాంక ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు కూడా అందుకుంది. ఇందుకోసం అదనంగా రూ.5 లక్షలు అందుకుంది.




