- Telugu News Photo Gallery Cinema photos Vijay Deverakonda's Family Star Shooting Wrapped know the details here Telugu Heroes Photos
Vijay Devarakonda – Family Star: ఆ ఫ్యామిలీ నుంచి బయటపడ్డ విజయ్ దేవరకొండ.
ఫ్యామిలీ స్టార్‌తో విజయ్ దేవరకొండకు బంధం తెగిపోయింది.. అదేంటి పుసుక్కున అంత మాటనేసారు అనుకుంటున్నారు కదా..? మరి అంతే కదా.. ఈ చిత్రంతో ఇక విజయ్‌కు పనిలేదు.. చేయాల్సిందంతా చేసారు. ఇకపై దర్శక నిర్మాతల పనే మిగిలింది.. దానికి రౌడీ బాయ్ కూడా తన వంతు సాయం చేయబోతున్నారు. మరింతకీ ఫ్యామిలీ స్టార్ అప్‌డేట్ ఏంటి..? ఓ పనైపోయింది బాబూ అంటున్నారు విజయ్ దేవరకొండ.
Updated on: Mar 18, 2024 | 6:02 PM

ఫ్యామిలీ స్టార్‌తో విజయ్ దేవరకొండకు బంధం తెగిపోయింది.. అదేంటి పుసుక్కున అంత మాటనేసారు అనుకుంటున్నారు కదా..? మరి అంతే కదా.. ఈ చిత్రంతో ఇక విజయ్‌కు పనిలేదు.. చేయాల్సిందంతా చేసారు.

ఇకపై దర్శక నిర్మాతల పనే మిగిలింది.. దానికి రౌడీ బాయ్ కూడా తన వంతు సాయం చేయబోతున్నారు. మరింతకీ ఫ్యామిలీ స్టార్ అప్‌డేట్ ఏంటి..? ఓ పనైపోయింది బాబూ అంటున్నారు విజయ్ దేవరకొండ.

కొన్ని నెలలుగా ఫ్యామిలీ స్టార్ షూటింగ్‌లో నాన్ స్టాప్‌గా పాల్గొంటున్నారు రౌడీ బాయ్. ముందుగా కమిట్ అయిన గౌతమ్ తిన్ననూరి సినిమాను పక్కనబెట్టి మరీ దిల్ రాజు సినిమాను పూర్తి చేసారు విజయ్.

తాజాగా ఈ చిత్ర షూటింగ్ పూర్తైనట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు. ఎప్రిల్ 5న విడుదల కానుంది ఫ్యామిలీ స్టార్. సాంగ్ షూట్‌తో ఫ్యామిలీ స్టార్ షూటింగ్‌కు గుమ్మడి కాయ్ కొట్టేసారు మేకర్స్.

తాజాగా ఈ చిత్ర షూటింగ్ పూర్తైనట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు. ఎప్రిల్ 5న విడుదల కానుంది ఫ్యామిలీ స్టార్. సాంగ్ షూట్‌తో ఫ్యామిలీ స్టార్ షూటింగ్‌కు గుమ్మడి కాయ్ కొట్టేసారు మేకర్స్.

అన్నింట్లో విజయ్ కూడా పాల్గొనబోతున్నారు. గీత గోవిందం తర్వాత విజయ్, పరశురామ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. పైగా సర్కారు వారి పాటతో పరశురామ్.. ఖుషీతో విజయ్.. ఇద్దరూ యావరేజ్ దగ్గరే ఆగిపోయారు.

అందుకే ఫ్యామిలీ స్టార్‌తో లెక్క సరి చేయాలనే కసితో ఉన్నారు. లక్కీ హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ ఇందులో విజయ్‌కు జోడీగా నటిస్తున్నారు.




