AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Godfather collections : మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమా మొదటి రోజు ఎంత వసూల్ చేసిందో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్. ఆచార్య సినిమాతో డీలా పడిన ఫ్యాన్స్ ను గాడ్ ఫాదర్ సినిమాతో ఆకాశమంత ఉత్సహాన్ని నింపారు మెగాస్టార్.

Godfather collections : మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమా మొదటి రోజు ఎంత వసూల్ చేసిందో తెలుసా..?
Godfather
Rajeev Rayala
|

Updated on: Oct 06, 2022 | 3:54 PM

Share

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్. ఆచార్య సినిమాతో డీలా పడిన ఫ్యాన్స్ ను గాడ్ ఫాదర్ సినిమాతో ఆకాశమంత ఉత్సహాన్ని నింపారు మెగాస్టార్. మలయాళ మూవీ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా రరీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దసరా కానుకగా గాడ్ ఫాదర్ సినిమాను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో చిరంజీవి డిఫరెంట్ గెటప్ లో కనిపించి ఆకట్టుకున్నారు. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించారు. లూసిఫర్ సినిమా కథలో మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు చాలా మార్పులు చేర్పులు చేసి సక్సెస్ అయ్యారు దర్శకుడు మోహన్ రాజా. ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అలాగే లేడీ సూపర్ స్థార్ నయనతార ఈ సినిమాలో చిరంజీవి సిస్టర్ గా నటించి ఆకట్టుకున్నారు. ఇక గాడ్ ఫాదర్ సినిమా మొదటి షో నుంచి మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

కొణిదెల సురేఖ సమర్పణలో ‘కొణిదెల ప్రొడక్షన్స్’, ‘సూపర్ గుడ్ ఫిలింస్’ బ్యానర్ ‌లపై ఆర్‌ బి చౌదరి, ఎన్‌ వి ప్రసాద్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమా మొదటి రోజు ఎంతో వసూల్ చేసిందంటే.. మొదటి రోజు ఈ మూవీ రూ.16.68 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు రూ.75.32 కోట్ల షేర్ ను రాబట్టాలి గాడ్ ఫాదర్. ఈ సినిమా ఏ ఏ ఏరియాల్లో ఎంతరబట్టిందంటే..

నైజాం 3.25 కోట్లు, సీడెడ్ 3.15 కోట్లు, ఉత్తరాంధ్ర 1.26 కోట్లు, ఈస్ట్ 1.60కోట్లు, వెస్ట్ 0.59 కోట్లు, గుంటూరు 1.75 కోట్లు, కృష్ణా 0.71 కోట్లు, నెల్లూరు 0.55 కోట్లు, మొత్తంగా ఏపీ – తెలంగాణ కలిపి 12.86 కోట్లు, అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా 1.50 కోట్లు, హిందీ 0.22 కోట్లు, ఓవర్సీస్ 2.10 కోట్లు, వరల్డ్ వైడ్ గా 16.68 కోట్లు వసూల్ చేసింది గాడ్ ఫాదర్ సినిమా.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..