AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bholaa Shankar : శరవేగంగా మెగాస్టార్ మూవీ షూటింగ్.. భోళాశంకర్ సినిమాతో బిజీగా చిరు..

మెగాస్టార్ నటించిన ఆచార్య సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు.

Bholaa Shankar : శరవేగంగా మెగాస్టార్ మూవీ షూటింగ్.. భోళాశంకర్ సినిమాతో బిజీగా చిరు..
Megastar
Rajeev Rayala
|

Updated on: Jan 24, 2022 | 3:39 PM

Share

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య(Acharya) సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో చరణ్ చిరు నక్సలైట్స్ గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, పాటలు, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి(chiranjeevi) మోహన రాజా డైరెక్షన్‌లో ‘లూసిఫర్‌’ రీమెక్‌ ‘గాడ్‌ ఫాదర్‌’లో నటించనున్నారు. ఇటీవలే ఊటీలో ఈ సినిమాకు సంబంధించి కొంతమేర షూటింగ్‌ కూడా జరిగింది. ఈ సినిమాలో నాయన తార నటిస్తుందని తెలుస్తుంది. అలాగే ఆ వెంటనే బాబీ దర్శకత్వంలో మరొక సినిమాను ప్రకటించారు. ఈ సినిమాకు వాల్తేరు వీరన్న అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.  ఇక మెహర్ రమేశ్ డైరెక్షన్‌లో ‘భోళా శంకర్‌'( Bholaa Shankar)ను కూడా అధికారికంగా ప్రారంభించారు. తమిళ ‘వేదాళం’కు రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మెగాస్టార్‌కు జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా కనిపించనుంది. కీర్తి సురేశ్‌ చిరుకి చెల్లెలిగా నటించనుంది.

ఈ సినిమాషూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న తమన్నా గతంలో చిరుతోకలిసి సైరా సినిమాలో యాక్ట్ చేసింది. కథ ప్రకారం ఆ సినిమాలో డాన్స్ కు, డ్యూయెట్స్ కు స్కోప్ లేదు. కానీ భోళాశంకర్ సినిమాలో మాత్రం అదిరిపోయే డ్యూయెట్స్ ఉండనున్నాయట. మెగాస్టార్ డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే  తమన్నా కూడా మంచి డాన్సర్ దాంతో ఈ సినిమాలో ఇద్దరు కలిసి అదరగొట్టనున్నారట. రీసెంట్ గా నే మెగాస్టార్  ఈ సినిమా షూటింగులో పాల్గొంటున్నారు. ఆయన కాంబినేషన్లోని కొన్ని కీలకమైన సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకి మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ranga Ranga Vaibhavanga: రంగ రంగ వైభవంగా అంటూ వచ్చేస్తున్న మెగా హీరో.. టైటిల్ టీజర్ విడుదల చేసిన వైష్ణవ్ తేజ్.. 

Viral Video : హాలీవుడ్‌ పాటకు భాంగ్రా స్టెప్పులతో అదరగొట్టిన పెళ్లి కూతురు..!

Vishnu Priya: సమంత పాటకు విష్ణుప్రియ రిహర్సల్ అదుర్స్.. ఊ అంటావ మావ అంటూ రచ్చ..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్