Dil Raju: ఫ్యాన్స్ ఫుల్ ఖుష్.. ఆ రెండు భారీ సినిమాల అప్డేట్స్ ఇచ్చేసిన బడా ప్రొడ్యూసర్..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా థియేటర్స్ లో సందడి చేసి దాదాపు రెండు సంవత్సరాలయ్యింది. దాంతో చరణ్ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( RamCharan) సినిమా థియేటర్స్ లో సందడి చేసి దాదాపు రెండు సంవత్సరాలయ్యింది. దాంతో చరణ్ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్(RRR) మూవీ ఇదిగో.. అదిగో అంటూ ఊరిస్తుంది. జనవరిలో విడుదల కావాల్సిన సినిమా ఇప్పుడు సమ్మర్ కు షిఫ్ట్ అయ్యింది. పరిస్థితులు ఇలానే కంటిన్యూ అయితే సమ్మర్ కూడా కష్టమే అంటున్నారు విశ్లేషకులు. ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత చరణ్ టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను కూడా పూర్తి చేశారు. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు(Dil Raju) నిర్మిస్తున్నారు. చరణ్ కు ఇది 15వ సినిమా కాగా దిల్ రాజుకు 50 వ సినిమా. శంకర్ – చరణ్ కాంబోలో వస్తున్న RC15 ని 2023 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని దిల్ రాజు ప్రకటించారు. ఈ సినిమా రాజకీయనేపథ్యంలో ఉండనుందని తెలుస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.
ఇదిలా ఉంటే మరో వైపు తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ తో దిల్ రాజు ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దళపతి విజయ్ వంశీ పైడిపల్లి తో కలిసి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం బీస్ట్ అనే సినిమా చేస్తున్న విజయ్ ఆ తర్వాత వంశీ సినిమాను మొదలు పెట్టనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే మల్టీలాంగ్వేజ్ లలో రూపొందనున్న ఈ మూవీ విజయ్ కెరీర్ లో 66వ సినిమా. ఇక ఈ సినిమాను 2022 దీపావళి పండక్కి విడుదల ప్లాన్ చేస్తున్నట్లు నిర్మాత దిల్ రాజు చెప్పుకొచ్చారు. అలాగే దిల్ రాజు మాట్లాడుతూ.. వంశీ చెప్పిన స్క్రిప్ట్ విజయ్ కు విపరీతంగా నచ్చిందని. 20 ఏళ్లలో తాను విన్న బెస్ట్ స్క్రిప్ట్ ఇదేనని విజయ్ అన్నారని తెలిపారు. అలాగే మార్చి నుంచి విజయ్ 66వ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం అని తెలిపారు దిల్ రాజు.
మరిన్ని ఇక్కడ చదవండి :