AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baby Movie: బేబి సక్సెస్ సెలబ్రెషన్స్.. ‘మెగా’ ఈవెంట్‍‏కు అతిథిగా రానున్న చిరంజీవి.. ఎప్పుడంటే..?

ఇప్పటివరకు దాదాపు రూ.70 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి రికార్డ్స్ క్రియేటే చేసింది. అటు ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టిన ఈ మూవీపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. అల్లు అర్జున్, అల్లు అరవింద్, రామ్ పోతినేని వంటి స్టార్స్ చిత్రయూనిట్‏ను పొగడ్తలతో ముంచెత్తగా.. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి సైతం బేబీ సినిమాపై రియాక్ట్ అయ్యారు. డైరెక్టర్ సాయి రాజేష్.. ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ ను ఇంటికి పిలిచి మరీ అభినందించారు.

Baby Movie: బేబి సక్సెస్ సెలబ్రెషన్స్.. ‘మెగా’ ఈవెంట్‍‏కు అతిథిగా రానున్న చిరంజీవి.. ఎప్పుడంటే..?
Baby Movie Mega Cult Celebr
Rajitha Chanti
|

Updated on: Jul 30, 2023 | 4:47 PM

Share

డైరెక్టర్ సాయి రాజేష్ తెరకెక్కించిన ట్రైయాంగిల్ లవ్ స్టోరీ బేబీ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాకు ఊహించని స్తాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీను శ్రీనివాస్ కుమార్ నిర్మించగా.. జూలై 14న ఎలాంటి అంచనాలు లేని చిన్న సినిమాగా అడియన్స్ ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటివరకు దాదాపు రూ.70 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి రికార్డ్స్ క్రియేటే చేసింది. అటు ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టిన ఈ మూవీపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. అల్లు అర్జున్, అల్లు అరవింద్, రామ్ పోతినేని వంటి స్టార్స్ చిత్రయూనిట్‏ను పొగడ్తలతో ముంచెత్తగా.. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి సైతం బేబీ సినిమాపై రియాక్ట్ అయ్యారు. డైరెక్టర్ సాయి రాజేష్.. ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ ను ఇంటికి పిలిచి మరీ అభినందించారు.

ఇక టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న ఈ సినిమాకు. ఇప్పుడు మెగాకల్ట్ సెలబ్రెషన్స్ పేరుతో చిత్రయూనిట్ ఓ ఈవెంట్ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్నారు. ఇక ఈ ఈవెంట్ డేట్, టైమ్ సైతం ఫిక్స్ చేశారు. ఈ రోజు (జూలై 30) ఈ మెగా కల్ట్ సెలబ్రెషన్స్ నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి

సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రానున్నట్లు మూవీ ప్రొడ్యూసర్ తన ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.