AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: ఒకేరోజు రెండు బ్లాక్ బస్టర్స్.. శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్..

ఇక నిన్న (ఆగస్ట్ 5న) రిలీజ్ అయిన రెండు సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి. ఉదయం నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి.

Megastar Chiranjeevi: ఒకేరోజు రెండు బ్లాక్ బస్టర్స్.. శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్..
Sitaramam
Rajitha Chanti
|

Updated on: Aug 06, 2022 | 11:31 AM

Share

గత కొద్ది రోజులుగా తెలుగు చిత్రపరిశ్రమను వరుస డిజాస్టర్స్ వేంటాడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఎన్నో అంచనాల మధ్య విడుదలైన చిత్రాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. దీంతో పాన్ ఇండియా చిత్రాలు కాకుండా తెలుగు పరిశ్రమలో హిట్ చిత్రాలు ఎప్పుడు వస్తాయా అని వెయిట్ చేస్తు్న్నారు ఆడియన్స్. ఇక నిన్న (ఆగస్ట్ 5న) రిలీజ్ అయిన రెండు సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి. ఉదయం నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటించిన బింబిసార, మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ డైరెక్టర్ హను రాఘవపూడి కాంబోలో వచ్చిన సీతారామం సినిమాలకు సూపర్ హిట్ టాక్ వచ్చింది.

ఈ రెండు చిత్రాలు హిట్ కావడంతో ఇండస్ట్రీలో సరికొత్త ఉత్సాహం వచ్చేసింది. ఇప్పటివరకు వరుస డిజాస్టర్స్‏ను చవిచూసిన మేకర్స్.. ఇప్పుడు తమ సినిమాలపై మరింత ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక ఒక్కరోజే విడుదలైన రెండు చిత్రాలు హిట్ కావడంతో సినీ ప్రముఖులు చిత్రయూనిట్స్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, విజయ్ దేవరకొండ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మెగాస్టార్ ట్వీట్..

” ప్రేక్షకులు సినిమా థియేటర్లకి రావడం లేదని బాధపడుతున్న ఇండస్ట్రీ కి ఎంతో ఊరటనీ మరింత ఉత్సాహాన్ని స్తూ, కంటెంట్ బావుంటే ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తారని మరోసారి నిరూపిస్తూ నిన్న విడుదలయిన చిత్రాలు రెండూ విజయం సాధించటం ఎంతో సంతోషకరం. ‘సీతారామం’, ‘బింబిసార’ చిత్రాల నటీనటులకు,నిర్మాతలకు, సాంకేతిక నిపుణులందరికీ నా మనః పూర్వక శుభాకాంక్షలు” అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.

విజయ్ దేవరకొండ ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.